Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: ఫ్యాన్సూ.. కాస్త ఇది చూడండర్రా!
By: Tupaki Desk | 12 Nov 2018 7:49 AM GMTరాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా నందమూరి మల్టిస్టారర్ #RRR ఈమధ్యనే లాంచ్ అయింది. తెలుగులో మల్టిస్టారర్ చిత్రాలు చాలానే వస్తున్నాయిగానీ ఇలా టాప్ లీగ్ స్టార్స్ ఇద్దరు కలిసి నటించే మల్టి స్టారర్ మాత్రం ఇదేనని చెప్పవచ్చు. ఒకరకంగా ఇది స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య ఉండే అనారోగ్యకరమైన పోటీని చాలావరకూ తగ్గించే అవకాశం ఉంది. మొదటి నుండి మెగా-నందమూరి ఫ్యాన్స్ మధ్యలో భారీ పోటీ ఉండేది. #RRR తో అది తగ్గుతుందని చాలామంది భావిస్తున్నారు గానీ కొంతమంది డై-హార్డ్ ఫ్యాన్స్ మాత్రం సినిమా లాంచ్ రోజు నుండే ఫైట్ చేసుకోవడం మొదలు పెట్టారు.
ఈ సినిమాను #RC13 అని మెగాఫ్యాన్స్.. కాదు కాదు ఇది #NTR29 అని నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో డిబేట్లు మొదలుపెట్టారు. రెండూ నిజమే కాబట్టి ఎవరిదీ మనం తప్పని అనలేము. ఇలాంటి ఇబ్బంది వస్తుందని ముందే ఊహించాడేమో గానీ జక్కన్న ఈ సినిమాకు #RRR అని నామకరణం చేశాడు. రాజమౌళి సినిమాను సుకుమార్ ఈక్వేషన్స్ లో చెప్పకుంటే RC13+NTR29= #RRR అని మనం ఫిక్స్ అయిపోవచ్చు.
ఈ పోటీలు పెట్టుకునే కొంతమంది ఫ్యాన్స్ ను ఎవరూ ఏం చెయ్యలేరుగానీ ఒకటి మాత్రం నిజం. సినిమా లాంచ్ రోజు చరణ్ - ఎన్టీఆర్ ల మధ్య ఉన్న కెమిస్ట్రీ మరోసారి అందరికీ తెలిసింది. ఇక పైనున్న ఫోటో ఒకసారి చూస్తే అసలు వాళ్ళు ఏ రేంజ్ లో ఫ్రెండ్స్ గా ఉన్నారో మనకు తెలుస్తుంది. ఎన్టీఆర్ ఏదో చెబుతూ ఉంటే.. చరణ్.. రానా ప్రభాస్.. రాజమౌళి.. కళ్యాణ్ రామ్.. వినాయక్.. కొరటాల శివ అందరూ ఆసక్తిగా వింటున్నారు. చరణ్.. ఎన్టీఆర్.. ప్రభాస్ లాంటి టాప్ స్టార్స్ ఎలాంటి ఈగో లేకుండా కబుర్లు చెప్పుకుంటూ ఫ్యాన్స్ సమజానికి ఫ్రెండ్ షిప్ సందేశం ఇస్తున్నట్టుగా లేదూ?