Begin typing your search above and press return to search.

RRR సాంగ్: నాటు నాటు.. వీర నాటు.. ఊర నాటు..!

By:  Tupaki Desk   |   9 Nov 2021 6:48 AM GMT
RRR సాంగ్: నాటు నాటు.. వీర నాటు.. ఊర నాటు..!
X
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ''ఆర్‌.ఆర్‌.ఆర్‌'' (రౌద్రం రణం రుధిరం). యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ - మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్ వరుస అప్డేట్స్ తో సందడి చేస్తున్నారు.

RRR నుంచి ఇప్పటికే విడుదలైన 'దోస్తీ' పాట విశేష స్పందన తెచ్చుకోగా.. రేపు బుధవారం సాయంత్రం 4 గంటలకు 'నాటు నాటు' అనే రెండో పాటను మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. అంతేకంటే ముందు ఈరోజు ఉదయం సాంగ్ ప్రోమోని విడుదల చేశారు. 'నా పాట సూడు.. నా పాట సూడు.. నా పాట సూడు.. నాటు నాటు నాటు నాటు నాటు నాటు.. వీర నాటు.. ఊర నాటు' అంటూ సాగిన ఈ ప్రోమో అలరిస్తోంది.

'నాటు నాటు' సాంగ్ మాస్‌ డ్యాన్స్‌ తో ఉండబోతోందనని.. రామ్‌ చరణ్‌ - ఎన్టీఆర్ ఇద్దరూ పవర్‌ ఫుల్‌ స్టెప్పులతో దుమ్ములేపినట్లు అర్థం అవుతోంది. ఎంఎం కీరవాణి ఈ పాటకు మాస్ ట్యూన్ సమకూర్చగా.. రాహుల్‌ సిప్లింగంజ్‌ - కాల భైరవ హుషారెత్తించేలా ఆలపించారు. ఈ గీతానికి గేయ రచయిత చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఈ పాటను జక్కన్న ఎలా చిత్రీకరించారో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌.. కొమురం భీమ్‌ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఆలియా భట్‌ - శ్రియ - సముద్రఖని- ఒలీవియా మోరీస్‌ కీలక పాత్రలు పోషించారు. సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య భారీ బడ్జెత్ తో నిర్మిస్తున్నారు.