Begin typing your search above and press return to search.

ఆర్‌ఆర్ఆర్ : యూఎస్ ఆడియన్స్ కు ఓ సర్‌ ప్రైజ్‌

By:  Tupaki Desk   |   12 March 2022 4:02 AM GMT
ఆర్‌ఆర్ఆర్ : యూఎస్ ఆడియన్స్ కు ఓ సర్‌ ప్రైజ్‌
X
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఈనెల 25 వ తారీకున భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. రాజమౌళి సినిమా అంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లో.. ఇండియా లో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ సినిమా యూఎస్ లో భారీ ఎత్తున విడుదల కాబోతుంది. కనుక అక్కడ ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ మొదలు అయ్యింది.

అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ సినిమా విడుదలకు సంబంధించిన సందడి వాతావరణం కనిపిస్తోంది. ఈ సినిమా ని అమెరికాలో సరిగమ సినిమాస్‌ వారు డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్న విషయం తెలిసిందే. సరిగమ సినిమాస్‌ వారు సోషల్ మీడియాలో తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ ఒకటి పెట్టారు. యుఎస్ లో ఉన్న ప్రేక్షకులకు సర్ప్రైజింగ్ న్యూస్ ఒకటి రేపు చెప్పబోతున్నాం అంటూ వారు ప్రకటించారు. రేపు ఆర్ ఆర్‌ ఆర్ సినిమా గురించి ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడిస్తామని వారు చేబుతున్నారు.

ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా యూఎస్ లో పొందలేని గౌరవం కు సంబంధించిన విషయం అంటూ ట్వీట్‌ లో పేర్కొన్నారు. వారు చేసిన ప్రకటన ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా యూఎస్ లో ఉన్న మొత్తం ఇండియన్ సినీ అభిమానులు అందరూ కూడా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సినిమా రిలీజ్ కి సంబంధించి ఉంటుందా లేదంటే ప్రమోషన్ కి సంబంధించి ఏమైనా అప్డేట్ ని అనేది చూడాలి. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉంది కనుక చిత్ర యూనిట్ సభ్యులు ఏమైనా యూఎస్ కి వెళ్లే ఆలోచనలో ఉన్నారేమో అంటూ కొందరు ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. అదే విషయాన్ని సరిగమ సినిమాస్‌ వారు రేపు ప్రకటిస్తారేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

యూఎస్ లో చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్ కి వెళ్తే కచ్చితంగా మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది.. అది అరుదైన విషయం అంటూ టాక్ వినిపిస్తుంది. యూఎస్ కి ప్రమోషన్ కోసం వెళ్లడం అంటే భారీ ఖర్చు అవుతుంది. ప్రమోషన్ విషయం లో కాకుండా సరిగమ సినిమాస్ వారు మరేదైనా సంచలన విజయాన్ని.. సర్ప్రైజింగ్ విషయాన్ని ఏమైనా ప్రకటిస్తారో చూడాలి.