Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: మాస్ కా మాస్టర్స్ ఫుల్ చిల్లింగ్
By: Tupaki Desk | 10 Nov 2021 6:37 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో ఆర్.ఆర్.ఆర్ సంక్రాంతి సందర్భంగా 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్ ఇప్పటికే దోస్తీ పాటను విడుదల చేసారు. అలాగే నాటు నాటు వీర నాటు అంటూ మరో పాట ప్రోమోని విడుదల చేయగా వైరల్ అయ్యింది. సాయంత్రం 4 గంటలకు నాటు నాటు పూర్తి పాటను మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు.
అయితే ఈ పాటలో దోస్త్ లిద్దరూ క్లాస్ గా టక్ టైతో కనిపించినా వేసేది మాత్రం నాటు స్టెప్పులేనని అర్థమైంది. ఇక ఈ సాంగ్ చిత్రీకరణ సమయంలో ఆ ఇద్దరి చిలౌట్ కి సంబంధించిన ఆన్ లొకేషన్ ఫోటో ఒకటి అంతర్జాలంలో వైరల్ గా మారింది. నాటు నాటు సాంగ్ మాస్ డ్యాన్స్ తో ఉండబోతోందనని.. రామ్ చరణ్ - ఎన్టీఆర్ ఇద్దరూ పవర్ ఫుల్ స్టెప్పులతో దుమ్ములేపనున్నారు.
పాట చిత్రీకరణ మ్యలో అలా మాస్ కా మాస్టార్స్ చిల్లింగ్ అవుతున్న ఫోటో ప్రస్తుతం ఫ్యాన్స్ లోకి దూసుకెళుతోంది. ఇందులో తారక్ .. చరణ్ ఏదో మాట్లాడుకుంటూ చిల్లింగ్ గా నవ్వేస్తూ గడిపేస్తున్నారు. #RRR మాస్ గీతం 4 PM వస్తోంది అంటూ టీమ్ సోషల్ మీడియాల్లో మరోమారు ప్రకటించింది. నాటు నాటు .. నాచో నాచో అంటూ హ్యాష్ ట్యాగుల్ని వైరల్ చేస్తున్నారు.
కీరవాణి మార్క్ నాటు సాంగ్
ఎంఎం కీరవాణి ఈ పాటకు మాస్ ట్యూన్ సమకూర్చగా.. రాహుల్ సిప్లింగంజ్ - కాల భైరవ హుషారెత్తించేలా ఆలపించారు. ఈ గీతానికి గేయ రచయిత చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఈ పాటను జక్కన్న ఎలా చిత్రీకరించారో తెలియాలంటే సాయంత్రం వరకూ ఆగాల్సిందే. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. కొమురం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఆలియా భట్ - శ్రియ - సముద్రఖని- ఒలీవియా మోరీస్ కీలక పాత్రలు పోషించారు. సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య భారీ బడ్జెత్ తో నిర్మిస్తున్నారు.