Begin typing your search above and press return to search.

RRR రీరికార్డింగ్ ఏ.ఆర్ రెహ‌మాన్ తో పోలుస్తారేమో?

By:  Tupaki Desk   |   4 July 2021 3:30 PM GMT
RRR రీరికార్డింగ్ ఏ.ఆర్ రెహ‌మాన్ తో పోలుస్తారేమో?
X
బాహుబ‌లి 1 .. బాహుబ‌లి 2 చిత్రాల‌కు గొప్ప‌ సంగీతం ఆర్.ఆర్ అందించారు మ‌ర‌క‌త‌మ‌ణి కీర‌వాణి. ఇప్పుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న‌ మ‌రో పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ కి ఆయ‌నే సంగీతం అందిస్తున్నారు. బాహుబ‌లి రీరికార్డింగ్ కి ప్ర‌శంస‌లు కురిసాయి. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ కి మ‌రో లెవ‌ల్ చూపిస్తారా? అన్న‌ది ఆస‌క్తికరంగా మారింది.

రౌద్రం రణం రుధిరం .. టైటిలే ఎంతో గంభీరంగా ఉంది. అంచ‌నాల్ని మించి సినిమాని మ‌రో లెవ‌ల్ కి తీసుకెళ్ల‌బోయేది క‌చ్ఛితంగా ఆర్.ఆర్ - బీజీఎం అనే చెప్పాలి. మ‌ర‌క‌త‌మ‌ణి ద‌శాబ్ధాల కెరీర్ లో త‌న అనుభ‌వం అంతా రంగ‌రించి ఈ సినిమా కోసం గొప్ప బీజీఎం ని సృజిస్తార‌నే అభిమానులు భావిస్తున్నారు. రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణినే సంగీతం యూనిక్ గా నిరూపించాలి. నేడు కీర‌వాణి జన్మదినం సంద‌ర్భంగా చిత్ర‌బృందం శుభాకాంక్షలు తెలియజేసింది.

ఆర్.ఆర్.ఆర్ మ్యూజిక్ ఆల్బ‌మ్ రిలీజ్ త్వ‌ర‌లోనే ఉంటుంద‌ని నేటి బ‌ర్త్ డేని పుర‌స్క‌రించుకుని హింట్ ఇచ్చారు. దీంతో పాటే అక్టోబ‌ర్ 13 రిలీజ్ కి స్టిక్ అయ్యి ఉన్నామ‌ని జ‌క్క‌న్న టీమ్ బ‌లంగానే చెబుతోంది. అంటే అప్ప‌టికి క్రైసిస్ మొత్తం తొల‌గిపోయి పూర్తిగా నార్మ‌ల్ స్టేజ్ కి వ‌చ్చేస్తామ‌ని జ‌క్క‌న్న న‌మ్మ‌కం అనుకోవాలి.

రామ్ చ‌ర‌ణ్ - ఎన్టీఆర్- ఆలియా-ఒలీవియా స‌హా ఎంద‌రో పాపుల‌ర్ స్టార్లు ఈ చిత్రంలో న‌టించారు. చ‌ర‌ణ్- తార‌క్ భారీ పోరాట స‌న్నివేశాల‌తో మూవీ ఆద్యంతం రంజింప‌జేస్తారు. చ‌ర‌ణ్ - ఆలియా ల‌వ్ స్టోరి.. బ్రిటీష్ యువ‌తితో తార‌క్ ల‌వ్ స్టోరి అంతకుమించి అన్న చందంగా ర‌క్తి క‌ట్టిస్తాయ‌ని చెబుతున్నారు. కీర‌వాణి మ్యూజిక్ ప‌నిత‌నం చాలా చాలా విష‌యాల్ని అద్భుతంగా ఎలివేట్ చేయాల్సి ఉంటుంది. మ‌ర‌క‌త‌మ‌ణికి అది అతి పెద్ద స‌వాల్ ఈ మూవీ. ముఖ్యంగా రెహ‌మాన్ లాంటి దిగ్గ‌జం ఉన్న సౌత్ ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌తిదీ సునిశితంగానే ప‌రిశీలిస్తారు. కీర‌వాణి స్టాండార్డ్ అంత‌ర్జాతీయ స్థాయిలో ఆశిస్తారు. ఛాలెంజ్ లో స‌త్తా చాటుతార‌నే భావిద్దాం. నేటి బ‌ర్త్ డే బోయ్ కీర‌వాణికి తుపాకి త‌ర‌పున శుభాకాంక్ష‌లు.