Begin typing your search above and press return to search.

RRR బిజినెస్ స్కై ఈజ్ లిమిట్

By:  Tupaki Desk   |   26 Dec 2019 2:30 PM GMT
RRR బిజినెస్ స్కై ఈజ్ లిమిట్
X
ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నRRR 2020 జూలై 31న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఆంధ్రాకు చెందిన మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్.. నైజాంకి చెందిన గిరిజ‌న వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ న‌టిస్తున్నారు. స్వాతంత్య్రోద్య‌మానికి ముందు జ‌రిగిన ఫిక్ష‌న్ క‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నారు. ఆలియాభ‌ట్- ఒలీవియా మోరిస్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.

RRR చిత్రానికి పాన్ ఇండియా కేట‌గిరీలో దేశ‌వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే భారీగా ప్రీరిలీజ్ బిజినెస్ సాగుతోంది. భారీ ధ‌ర‌లు కోట్ చేస్తున్నా ఏరియా వైజ్ పంపిణీదారులు రైట్స్ ని ఛేజిక్కించుకుంటున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా రైట్స్ ని ప్ర‌ముఖ పంపిణీదారులు 13.20 కోట్లు వెచ్చించి ఛేజిక్కించుకున్నార‌ని తెలుస్తోంది. గీతా అండ్ ష‌న్ముఖ ఫిలింస్ ఇంత‌ ఫ్యాన్సీ ధ‌ర‌ను చెల్లించి రైట్స్ ని కొనుక్కుందట‌.

దాదాపు 250-300 కోట్ల మ‌ధ్య బ‌డ్జెట్ తో అత్యంత భారీగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామ‌ని నిర్మాత దాన‌య్య ప్ర‌క‌టించారు. అంటే భారీ రేంజులోనే అన్ని భాష‌ల్లోనూ ప్రీరిలీజ్ బిజినెస్ సాగించాల్సి ఉంటుంది. ఇక రిలీజ్ కి ఇంకో ఆరు నెల‌ల స‌మ‌యం ఉంది కాబ‌ట్టి ఈలోగానే ప్రీరిలీజ్ బిజినెస్ కి సంబంధించిన మ‌రిన్ని క్లియ‌ర్ క‌ట్ డీటెయిల్స్ రివీల్ అవుతాయేమో చూడాలి. ఈ సినిమాకి థియేట్రిక‌ల్ తో పాటు.. నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ ప‌రంగా భారీగా ధ‌రల్ని నిర్మాత దాన‌య్య కోట్ చేస్తున్నార‌ని ఇంత‌కుముందు క‌థ‌నాలొచ్చాయి.