Begin typing your search above and press return to search.

RRR కు ఇక ఆ ఆరు రోజులే కీల‌కం

By:  Tupaki Desk   |   12 March 2022 2:30 AM GMT
RRR కు ఇక ఆ ఆరు రోజులే కీల‌కం
X
మ‌రి కొన్ని రోజుల్లో ఇండియ‌న్ సినీ చ‌రిత్ర‌లో అద్భుతం జ‌ర‌గ‌బోతోందా? `RRR` స‌రికొత్త చ‌రిత్ర‌కు సాక్ష్యంగా నిల‌వ‌బోతోందా? అంటే టాలీవుడ్ వ‌ర్గాల్లో అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తొలి సారి క‌లిసి న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ `RRR (రౌద్రం ర‌ణం రుధిరం)`.

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఈ మూవీతో మ‌రో సారి చ‌రిత్ర‌ని తిర‌గ‌రాయ‌బోతున్నాడ‌ని ఇప్ప‌టికే ట్రేడ్ వ‌ర్గాలు భారీగా లెక్క‌లు వేస్తున్నాయి. యుఎస్ ప్రీమియ‌ర్స్ ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తూ అడ్వాన్స్ బుకింగ్ ప‌రంగా ఈ మూవీ వ‌న్ మిలియ‌న్ మార్కు క్ల‌బ్ లో చేర‌డం మ‌రింత బ‌లాన్ని చేకూరుస్తోంది.

గ‌త మూడేళ్లుగా అన్ని అడ్డంకుల్ని అధిగ‌మించి `RRR` ఈ నెల 25న అత్యంత భారీ స్థాయిలో థియేట‌ర్ల‌లో వ‌ర‌ల్డ్ వైడ్ గా సంద‌డి చేయ‌డానికి వ‌చ్చేస్తోంది. మ‌రో రెండు వారాలు మాత్ర‌మే వుండ‌టంతో చిత్ర బృందం ప్ర‌చార ఢంకా మోగించేశారు. ఈ నెల 14 నుంచి ఈ మూవీ ప్ర‌చార ప‌ర్వాన్ని మ‌రోసారి ప్రారంభించ‌బోతున్నామ‌ని గురువారం ప్ర‌క‌టించారు.

స్వాంతంత్య్రం కోసం ఇద్ద‌రు పోరాట యోధులు చేసిన స‌మ‌రం నేప‌థ్యంలో ఫిక్ష‌న‌ల్ స్టోరీని జోడించి ఈ మూవీని తెర‌కెక్కించారు రాజ‌మౌళి. సినిమాలో పెట్రియాటిక్ మూవ్ మెంట్ నేప‌థ్యంలో వ‌చ్చే `ఎత్త‌ర జెండా` అంటూ సాగే లిరిక‌ల్ వీడియోని ఈ నెల 14న చిత్ర బృందం విడుద‌ల చేస్తోంది.

దీంతో ప్ర‌చార ప‌ర్వాన్ని ప్రారంభిస్తోంది. ఈ సంద‌ర్భంగా ఈ మూవీకి ఆరు రోజులు అత్యంత కీల‌కంగా నిల‌వ‌నున్నాయ‌ని తెలుస్తోంది. ఎన్టీఆర్‌, అలియాభ‌ట్‌, రామ్ చ‌ర‌ణ్ ల‌కు సంబంధించిన స్టిల్ ని మేక‌ర్స్ ఇటీవ‌ల విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్ అభిమానుల్ని అమితంగా ఆక‌ట్టుకుంటోంది. `14` న లిరిక‌ల్ వీడియోని విడుద‌ల చేస్తున్న చిత్ర బృందం మార్చి `15` హీరోయిన్ అలియా భ‌ట్ పుట్టిన రోజు సంద‌ర్భంగా మ‌రో స్పెష‌ల్ వీడియోని కూడా విడుద‌ల చేసే అవ‌కాశం వుంద‌ని చెబుతున్నారు.

ఇక మార్చి `18`న దుబాయ్ లో క‌నీ వినీ ఎరుగ‌ని స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఈ డే కూడా RRR కు కీల‌క‌మే. ఆ త‌రువాత బెంగ‌ళూరులోనూ మార్చి `19`న భారీ ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్ ని కూడా నిర్వ‌హిస్తార‌ట‌.

ఇక మార్చి `24`న యుఎప్ ప్రీమియ‌ర్స్ జ‌ర‌గ‌బోతున్న విష‌యం తెలిపిందే. ఈ డే కూడా సినిమాకు అత్యంత కీకంగా మార‌బోతోంది. ఎందుకంటే మూవీ రిజ‌ల్ట్ ఆల్ మోస్ట్ బ‌య‌టికి వ‌చ్చేస్తుంది కాబ‌ట్టి.

ఇక మార్చి `25` మ‌రింత కీల‌కం. ఇది ఫైన‌ల్ జ‌డ్జిమెంట్ డే. ఈ రోజున వ‌ర‌ల్డ్ వైడ్ గా ఈ మూవీ రిలీజ్ కాబోతున్న విష‌యం తెలిసిందే. ఇలా మార్చి 14 నుంచి రిలీజ్ డే మార్చి 25 వ‌ర‌కు ఆరు రోజులు `ఆర్ ఆర్ ఆర్`కు అత్యంత కీల‌కంగా మార‌బోతున్నాయి.

చివ‌రి రోజు సినిమా ఫలితాన్ని డిసైడ్ చేయ‌బోతోంది. ఇప్ప‌టికే ఈ మూవీ కోసం వ‌రల్డ్ వైడ్ గా అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. `ఆర్ ఆర్ ఆర్‌` ఎలాంటి రికార్డుల్ని సృష్టించ‌నుంద‌న్న‌ది తెలియాలంటే మార్చి 25 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.