Begin typing your search above and press return to search.

రాజమౌళితో చనువుగా నాకు మైనస్సే: ఎన్టీఆర్

By:  Tupaki Desk   |   18 March 2022 4:11 PM GMT
రాజమౌళితో చనువుగా నాకు మైనస్సే: ఎన్టీఆర్
X
రాజమౌళి దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మితమైన 'ఆర్ ఆర్ ఆర్' ఈ నెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. హైదరాబాద్ లో ప్రమోషన్స్ ను పూర్తి చేసిన ఈ సినిమా టీమ్, 'దుబాయ్' చేరుకుంది. అక్కడ జరిగిన ప్రెస్ మీట్ కి రాజమౌళి .. ఎన్టీఆర్ .. చరణ్ హాజరయ్యారు. "రాజమౌళితో మొదటి నుంచి కూడా మీరు చాలా చనువుగా ఉంటూ వస్తున్నారు కదా? ఆయనతో చనువుగా ఉండటం మీకు ప్లస్ అయిందా? మైనస్ అయిందా? అనే ప్రశ్న ఎన్టీఆర్ కి ఎదురైంది.

అందుకు ఎన్టీఆర్ స్పందిస్తూ .. "ఆయనతో చనువుగా ఉండటం నాకు మైనస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఏ మాత్రం కనికరం లేకుండా నన్ను 65 నైట్స్ ఇబ్బంది పెట్టాడు. నాకు సంబంధించిన నైట్ ఎఫెక్ట్ సీన్స్ ను షూట్ చేయడం మొదలుపెట్టింది సమ్మర్లో. ఆ సీన్స్ లో నేను వాటర్లో తడిసి మరీ యాక్ట్ చేయాలి. సమ్మర్ కనుక బాగానే ఉందిలే అనుకున్నాను. కానీ కరోనా కారణంగా షూటింగు వాయిదా పడిపోయింది. కరోనా పోయిన తరువాత, ఎక్కడైతే షూటింగు ఆగిపోయిందో జక్కన్న అక్కడి నుంచే షూటింగును మొదలుపెట్టాడు.

అప్పటికి చలికాలం వచ్చేసింది. ఆ చలిలో .. రాత్రి వేళలో .. తెల్లవారు జామున ఆయన ఆ సీన్స్ తీసేవారు. దాంతో షూటింగులో గజ గజ వణుకుతూ చేశాను. రాజమౌళిగారిలో ఎప్పుడూ ఫైర్ ఉంటుంది గనుక ఆయన బాగానే ఉండేవారు. నేను మాత్రం తట్టుకోలేకపోయాను. ఈ ఒక్క విషయంలో తప్ప .. మిగతా అన్ని విషయాల్లోను నాకు ప్లస్ లే అని చెప్పాలి. ఒక నటుడిగా నేను ఈ రోజున ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం రాజమౌళిగారే" అని చెప్పుకొచ్చాడు. అలా ఈ సందర్భంలో ఈ వేదికపై తనకి రాజమౌళి పట్ల గల అభిమానాన్ని చాటుకున్నాడు .. రాజమౌళిని ఆకాశానికి ఎత్తేశాడు.