Begin typing your search above and press return to search.

ఆర్‌ఆర్‌ఆర్‌ : ప్రతి ఈవెంట్‌ లో.. ఇంటర్వ్యూలో అవే ముచ్చట్లు

By:  Tupaki Desk   |   20 March 2022 4:30 PM GMT
ఆర్‌ఆర్‌ఆర్‌ : ప్రతి ఈవెంట్‌ లో.. ఇంటర్వ్యూలో అవే ముచ్చట్లు
X
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమా మార్చి 25వ తారీకున విడుదలకు సిద్దంగా ఉంది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలను అంతే భారీగా చిత్ర యూనిట్‌ సభ్యులు నిర్వహిస్తున్నారు. గత వారం రోజులుగా ఎక్కడ చూసినా కూడా రాజమౌళి.. ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌ లు మాత్రమే కనిపిస్తూ సినిమా కు ప్రమోషన్‌ ను చేస్తున్నారు.

రోజులో పదుల కొద్దీ ఇంటర్వ్యూ లు.. ఈవెంట్‌ లు.. ప్రెస్ మీట్ లు అంటూ వీరి జర్నీ సాగుతోంది. దుబాయ్.. కర్ణాటక ఇలా దేశ విదేశాల్లో వీరు ముగ్గురు తిరుగుతూ సినిమా ప్రమోషన్ ను మరో లెవల్ అన్నట్లుగా చేస్తున్నారు. అయితే మెల్ల మెల్లగా వీరి ఈవెంట్‌ లు మరియు ప్రెస్ మీట్‌ లు మరియు ఇంటర్వ్యూలు ప్రేక్షకులకు బోర్ కొడుతున్నాయి అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం మొదలయ్యింది. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఎప్పుడు చూసినా అవే ముచ్చట్లు అంటూ పెదవి విరుస్తున్నారు.

రామ్‌ చరణ్ మరియు ఎన్టీఆర్‌ ఇంటర్వ్యూలో ఇద్దరు ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకోవడం.. తమ స్నేహం గురించి మాట్లాడటం కామన్‌ విషయం అయ్యింది. అంతే కాకుండా ఇద్దరు కూడా రాజమౌళి పై తమ ప్రేమను అదే సమయంలో కోపంను కూడా చూపిస్తూ మాట్లాడటం మనం చూస్తూనే ఉన్నాం. మ్యాటర్‌ కాస్త అటు ఇటు అయినా కూడా ఇద్దరు హీరోలు ప్రతి చోట ఒకే విషయాన్ని చెబుతున్నారు అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక రాజమౌళి విషయానికి వస్తే ఆయన ఎక్కువ శాతం హీరోలు ఇద్దరు రామ్‌ చరణ్ మరియు ఎన్టీఆర్‌ లపై ప్రశంసలు కురిపిస్తూ మాట్లాడుతు ఉన్నాడు. వారు ఈ సినిమాకు లభించడం అదృష్టం అన్నట్లుగా చెబుతున్నాడు. వారిద్దరి మద్య ఉన్న స్నేహం ఎలాంటిది... షూటింగ్‌ లో వారిద్దరు ఎలా ప్రవర్తించే వారు అనే విషయాలను రాజమౌళి తన ఇంటర్వ్యూలు మరియు ప్రెస్ మీట్‌ సందర్బంగా చెబుతూ ఉన్నాడు.

ఇలా ఎక్కడ చూసినా కూడా అవే ముచ్చట్లు ఉండటం వల్ల ఆర్ ఆర్‌ ఆర్‌ ప్రమోషనల్‌ స్టఫ్ ను ప్రేక్షకులు లైట్ తీసుకుంటున్నారు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా ఈ ప్రమోషన్‌ కార్యక్రమంలో హీరోయిన్‌ ఆలియా భట్‌ తో పాటు మరెవ్వరు కూడా కనిపించడం లేదు. ఆ కారణం వల్ల కూడా ప్రేక్షకులు బోర్ ఫీల్‌ అవుతున్నారేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి ఆర్ ఆర్ ఆర్‌ సినిమా యూనిట్‌ సభ్యులు సినిమాను భారీగా ప్రమోట్‌ చేయాలనే ఉద్దేశ్యంతో బోర్‌ కొట్టిస్తున్నారనే టాక్‌ వినిపిస్తుంది. ప్రమోషన్‌ బోర్‌ కొట్టినా సినిమా విజువల్‌ వండర్ గా ఉంటుందని ప్రతి ఒక్కరు నమ్మకం పెట్టుకుని మరీ ఎదురు చూస్తున్నారు. ప్రేక్షకులు ఎంత బోర్ కొట్టినా ఈనెల 24వ తారీకు వరకు.. ఆ తర్వాత కూడా సినిమా ప్రమోషన్ కంటిన్యూ అవుతూనే ఉంటుందని కొందరు అంటున్నారు.