Begin typing your search above and press return to search.

RRR వారంలోనే.. ఇక లబ్ డ‌బ్ ల‌బ్ డ‌బ్..!

By:  Tupaki Desk   |   17 March 2022 5:53 PM GMT
RRR వారంలోనే.. ఇక లబ్ డ‌బ్ ల‌బ్ డ‌బ్..!
X
2022 మోస్ట్ అవైటెడ్ మూవీగా RRR సంచ‌ల‌నాల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్స్ ను శరవేగంగా జరుపుకుంటుంది. చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నందున‌ ఈ సినిమా భారీ ఓపెనింగులు సాధిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

తాజాగా గుస‌గుస‌ల‌ ప్రకారం.. ఈ సినిమా రన్ టైమ్ మూడు గంటల ఆరు నిమిషాల యాభై నాలుగు సెకన్లు ఉంటుంద‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఇది చాలా నిడివితో కూడుకున్నదే కానీ రాజమౌళి సినిమా కావడంతో ఎవరికీ అంత ఇబ్బంది ఉండ‌క‌పోవ‌చ్చు. ముఖ్యంగా వీఎఫ్ ఎక్స్ భారీ యాక్ష‌న్ గ్లింప్స్ సీట్ ఎడ్జ్ ట్రీట్ తో మెరిపిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఎన్టీఆర్ - రామ్ చరణ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా రికార్డు స్థాయిలో విడుదల కానుంది. రేపటి నుండి ప్రమోషన్ కార్యక్రమాల్లో మ‌రో లెవ‌ల్ ప్రారంభం కానుంది. స‌ర్వ‌త్రా అభిమానుల్లో సందడిని మరో స్థాయికి తీసుకువెళ్లేందుకు జ‌క్క‌న్న టీమ్ ప్ర‌య‌త్నిస్తోంది.

RRR రన్ టైమ్ లాక్ అయింది.. సెన్సార్ యుఏ స‌ర్టిఫికెట్ ఇచ్చింది. ఇప్ప‌టికే ఆర్.ఆర్.ఆర్ సెన్సార్ టాక్ అద్భుతం అంటూ క్రిటిక్ ఉమైర్ సంధు సోష‌ల్ మీడియాల్లో బోలెడంత సంద‌డి చేశాడు. ఇందులో ఎన్టీఆర్ న‌ట‌న మ‌రో లెవ‌ల్లో ఉంటుంద‌ని ఎన్టీఆర్ - రామ చ‌ర‌ణ్ ల కెరీర్ బెస్ట్ అవుతుంద‌ని కూడా అన్నాడు. ఇంకో వారం రోజులే స‌మ‌యం మిగిలి ఉంది. తార‌క్ .. చ‌ర‌ణ్ .. రాజ‌మౌళి అభిమానుల గుండెల్లో లబ్ డ‌బ్ పెరుగుతూనే ఉంది.