Begin typing your search above and press return to search.

ఇలాంటి కారణాలతో 'RRR' షూటింగ్ ఆలస్యం కాదు కదా..?

By:  Tupaki Desk   |   10 March 2021 7:30 AM GMT
ఇలాంటి కారణాలతో RRR షూటింగ్ ఆలస్యం కాదు కదా..?
X
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ టాలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి జోడీగా అలియా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సాంగ్ షూట్ చేయడానికి పెద్ద సెట్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల్లో ట్రిపుల్ ఆర్ షూట్ కోసం అలియా హైదరాబాద్ లో వాలిపోతుందని అనుకుంటుండగా.. ఇప్పుడు అమ్మడు క్వారెంటైన్ కి వెళ్లిపోయిందనే వార్తలు 'ఆర్.ఆర్ ఆర్' బృందాన్ని కలవర పెడుతున్నాయని టాక్ నడుస్తోంది.

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ మరియు ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే రణబీర్ గర్ల్ ఫ్రెండ్ ఆలియా ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో 'గంగూబాయి కతియావాడి' సినిమాలో నటిస్తోంది. ఇప్పుడు వారిద్దరికీ కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో అలియా కూడా హోమ్ క్వారెంటైన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆమెకు కరోనా నిర్ధారణ పరీక్షలో నెగిటివ్ అని తేలిందని.. అయినప్పటికీ కొన్ని రోజులు స్వీయ నిర్బంధంలో ఉండాలని నిర్ణయించుకుందని బీ టౌన్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ కరోనా పరిస్థితుల్లో అలియా ముంబై నుంచి రావడం కష్టంగా మారితే మాత్రం 'ఆర్.ఆర్ ఆర్' షూట్ ఇంకాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు.