Begin typing your search above and press return to search.
#RRR ఒక హాలీవుడ్ సినిమాలా వెయిట్ చేయాలా?
By: Tupaki Desk | 9 Jun 2021 8:40 AM GMTటాలీవుడ్ లో ఒక్కో సినిమా పూర్తవ్వడానికి 90లలో మహా అయితే 2-3 నెలల సమయం ఎక్కువ. దర్శకరత్న దాసరి నారాయణ రావు నెల రోజుల లోపే చాలా సినిమాలు పూర్తి చేయగలిగారు. కానీ కాలంతో పాటే మార్పు. బడ్జెట్లు పెరిగాయి.. పర్ఫెక్షన్ విజువల్ గ్రాండియారిటీ కోసం ఎక్కువ శ్రమించే దర్శకులు పెరగడంతో టైమ్ పీరియడ్ కూడా పెరిగింది. ఇటీవల 6-8 నెలలకు పెరిగింది. కొందరు ఏడాది తీసుకుంటున్నారు.
అయితే పాన్ ఇండియా సినిమాల రాకతో అసలు డ్యూరేషన్ అనేది మ్యాటరే కాకుండా పోయింది. ఏడాదికి రెండు సినిమాలు చేయగిలిగిన దర్శకులే ఇప్పుడు ఏళ్లకు ఏళ్లు టైమ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది.
అయితే ఎస్.ఎస్.రాజమౌళి బాహుబలి రెండు భాగాల్ని కలిపి మూడేళ్లలో పూర్తి చేస్తే ఈసారి ఒక్క ఆర్.ఆర్.ఆర్ పూర్తి చేయడం కోసం ఏకంగా ఐదేళ్లు వేచి చూడాల్సిన పరిస్థితి. ఈ ఐదేళ్లలో ఆయన పాన్ ఇండియా కాకపోతే ఓ 7-8 సినిమాలు ఈజీగా తీసేవారేమో..!!! ఆర్.ఆర్.ఆర్ కథ- స్క్రిప్టు కోసమే రాజమౌళి చాలా టైమ్ తీస్కున్నారు. ఆ తర్వాత ప్రారంభించాక రకరకాల అడ్డంకులు.. ఒకటికి రెండు సార్లు కరోనా ప్రళయంలా ముంచుకొచ్చింది. జక్కన్న సహా కాస్టింగ్ కూడా కరోనా భారిన పడ్డారు. దీంతో గత ఏడాది ఆర్నెళ్లు .. ఈ ఏడాది ఆరు నెలలు వృధా అయ్యింది.
2021 సంక్రాంతికి రిలీజ్ కావాల్సినది దసరా రిలీజ్ అంటూ అక్టోబర్ కి వాయిదా వేశారు. ఇప్పటికీ షూటింగ్ పెండింగ్ ఉంది. అది అయ్యాకా ఆరు నెలల పాటు పోస్ట్ ప్రొడక్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ ఏడాది దసరాకి కానీ 2022 సంక్రాంతికి కానీ రిలీజయ్యేందుకు ఆస్కారం లేదని భావిస్తున్నారు. వచ్చే వేసవి నాటికి కానీ లైన్ క్లియరవ్వదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక రిలీజ్ తేదీని ఈసారి ప్రకటించే ఆలోచన లేదట. వాయిదా గురించి మాత్రమే చెప్పాలని రాజమౌళి భావిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఒక హాలీవుడ్ సినిమా రేంజులో ఐదేళ్ల సమయం తీసుకుంటున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఏళ్ల తరబడి అంత ఓపిగ్గా పని చేస్తున్న రాజమౌళి మొండితనాన్ని ఈ సందర్భంగా ప్రశంసించకుండా ఉండలేం.