Begin typing your search above and press return to search.
ప్రోస్తెటిక్ మేకప్ తో థియేటర్ కి చరణ్ - ఎన్టీఆర్
By: Tupaki Desk | 20 March 2022 3:30 AM GMTదేశ వ్యాప్తంగా సినీ ప్రియులు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించారు. రిలీజ్ డేట్ ఫైనల్ కావడంతో దర్శకుడు రాజమౌళితో పాటు హీరోలు ఇద్దరు దేశ వ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తూ ప్రమోషనల్ టూర్ చేస్తున్నారు. ఇటీవల దుబాయ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్మిహించిన టీమ్ శనివారం కర్ణాకటలోని చిక్ మంగళూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీ స్థాయిలో చేశారు.
ఇదిలా వుంటే ఈ మూవీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఫస్ట్ డే ఫస్ట్ షోని అభిమానుల మధ్య కూర్చుని ఇద్దరు హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఏ థియేటర్ లో చూడబోతున్నారన్నది ఇప్పుడు వైరల్ గా మారింది. ఇటీవల ఆఫ్ ది రికార్డ్ అంటూ ఓ వీడియోని చిత్ర బృందం వదిలింది. ఇందులో రాజమౌళి నవ్వుతూనే ఇద్దరు హీరోలు ఎక్కడ ఏ థియేటర్ లో ఎలా సినిమా చూడాలో చెప్పేశాడు.
చరణ్ తను నటించిన `చిరుత` ప్రీమియర్ షోని మాత్రమే చూశానని, ఇంత వరకు ఆడియన్స్ మధ్య కూర్చుని సినిమా చూడలేదని చెప్పాడు. ఎన్టీఆర్ మాత్రం తాను అది కూడా చేయలేదని, ఇంత వరకు తన కెరీర్ లో తను నటించిన చిత్రాన్ని థియేటర్ లో చూడలేదని, `బృందావనం` మూవీ కోసం థియేటర్ విజిట్ వెళితే ఆడియన్స్ సినిమాని చూడటం మానేసి తననే చూడటం మొదలుపెట్టారని, ఆ తరువాత తాను ఏ సినిమాని కూడా థియేటర్ లో ప్రేక్షకులతో కలిసి చూడలేదని స్పష్టం చేశాడు.
అయితే దర్శకుడు రాజమౌళి మాత్రం ఈ ఇద్దరు హీరోలకు భిన్నంగా తాను చేసిన సినిమాల బెనిఫిట్ షోలని ఫ్యామిలీతో కలిసి చూస్తుంటారట. కూకట్ పల్లిలోని భ్రమరాంబ థియేటర్ లో రాజమౌళి తన ప్రతీ సినిమా బెనిఫిట్ షోని ప్రేక్షకుల మధ్య కూర్చుని వారి రెస్పాన్స్ ని గమనిస్తూ చూస్తారట. ఇదే విషయాన్ని హీరోలకు తాజా ఇంటర్వ్యూలో చెప్పేశారు రాజమౌళి. అయితే తాము కూడా అలాగే చూస్తామని, ఇందు కోసం ఏర్పాట్లు చేయమని ఎన్టీఆర్ జక్కన్నతో అన్నాడు.
అయితే ఎప్పటిలా భారీగా బాడీగార్డ్ లని వేసుకుని థియేటర్ కి వస్తే మిమ్మల్ని ప్రేక్షకులు లోపలికి వెళ్లనివ్వడం కష్టమని, ఎలాంటి బాడీగార్డ్ హంగామా లేకుండా భ్రమరాంబ థియేటర్ లో సినిమా చేసేస్తే బెటర్ అని చెప్పేశాడు. మరి అభిమానులు గుర్తు పట్టకుండా ఎలా అని ఎన్టీఆర్ కి అనుమానం వచ్చి జక్కన్న ని అడిగేస్తూ ప్రోస్తెటిక్ మేకప్ తో వెళితే సరి అన్నాడు. అందుకు అభ్యంతరం చెప్పిన జక్కన్న రిలీజ్ రోజు రాత్రే థియేటర్ కి వెళ్లిపోయి అక్కడే వుండేసి షో అయ్యాక బయటికి రండి అని చెప్పాడు. ఏంటీ థియేటర్ లోనే ముందు రోజు పడుకుని ఆ తరువాత అభిమానులకు దొరక్కుండా సినిమా చూడాలా? అని చరణ్ అనే సరికి ముగ్గురు నవ్వేశారు.