Begin typing your search above and press return to search.
ఆర్ ఆర్ ఆర్ : ఈ టైటిల్ నిజమేనా!
By: Tupaki Desk | 13 Nov 2018 8:31 AM GMTపూజా కార్యక్రమాలు పూర్తి చేసి ఇంకా 48 గంటలు కూడా పూర్తి కాలేదు. టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ మల్టీ స్టారర్ అప్పుడే సంచలనాలకు దారి తీస్తోంది. 19 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నాం అని నిర్మాత దానయ్య ప్రకటించేసారు కాబట్టి ఆ విషయంలో సస్పెన్స్ అక్కర్లేదు. ఇకపోతే దీని టైటిల్ కు సంబంధించి ఫ్యాన్స్ లో విపరీతమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆర్ ఆర్ ఆర్ ని డీకోడ్ చేసి కొందరు రామ రావణ రాజ్యం అని నిర్వచనం ఇవ్వడంతో అది కాస్తా వైరల్ అయిపోయింది. ఇది ఫిక్స్ అనుకుంటున్న వాళ్ళ సంఖ్య తక్కువేమీ లేదు.
ఆర్ ఆర్ ఆర్ అంటే రామ్ చరణ్-రామరావు-రాజమౌళి అని ముందు నుంచి యూనిట్ క్లారిటీ ఇస్తున్నప్పటికీ ఇప్పుడు అది సైడ్ లైన్ అయిపోయి రామ రావణ రాజ్యం వెలుగులోకి వచ్చింది. దాని ప్రకారం రామ అంటే రామ్ చరణ్ అని వినయ విధేయ రామను ఉటంకిస్తూ రావణ అంటే తారక్ అని జై లవకుశలోని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను ఉదాహరణగా చూపిస్తూ ఇష్టం వచ్చిన రీతిలో విశ్లేషణలు చేస్తున్నారు. కాని యూనిట్ నుంచి విశ్వసనీయ సమాచారం మేరకు అసలు రామ రావణ రాజ్యం టైటిల్ పరిశీలనలో కూడా లేదట.
కేవలం ప్రచారమే అని కొట్టి పారేస్తున్నారు. షూటింగ్ ఇంకా చాలా కాలం జరుగుతుంది కాబట్టి ఆ లోపు ఇద్దరు హీరోల ఇమేజ్ కు తగ్గట్టు పవర్ ఫుల్ టైటిల్ ను ఆలోచించవచ్చు అనే రీతిలో జక్కన్న ప్రణాళిక ఉందట. మరి రామ రావణ రాజ్యం వర్కింగ్ టైటిల్ గా ప్రచారం కంటిన్యూ అయ్యేలాగే ఉంది. ఎంత లేదన్నా ఏడాది పైగా షూటింగ్ సాగుతుంది కాబట్టి అప్పటిదాకా అభిమానులకు ఎదురు చూపులు తప్పవు