Begin typing your search above and press return to search.

ద‌స‌రా బ‌రి నుంచి RRR ఎగ్జిట్ అయితే..?

By:  Tupaki Desk   |   19 Aug 2021 6:30 AM GMT
ద‌స‌రా బ‌రి నుంచి RRR ఎగ్జిట్ అయితే..?
X
క‌రోనా అంతా మార్చేసింది. ముఖ్యంగా సినీప‌రిశ్ర‌మ ద‌శ దిశ తిరిగిపోయింది. ఇప్ప‌టికీ ఏదీ స‌వ్యంగా సాగ‌డం లేదు. షూటింగులు ఆల‌స్యం.. రిలీజ్ లు వాయిదాలు.. ప‌రిశ్ర‌మ‌లో ఏం జ‌రుగుతోందో తెలీని గంద‌ర‌గోళం సృష్టించింది. ప్ర‌ణాళిక‌ల‌న్నీ తారుమార‌య్యాయి. 2020-21 సీజన్ అత్యంత వ‌ర‌స్ట్ సీజ‌న్ గా రికార్డుల‌కెక్కింది. ఇక ఇదే స‌మ‌యంలో ఇండ‌స్ట్రీ ఎన్నో పాఠాల్ని నేర్చుకుంది. అలాగే ఓటీటీ డిజిట‌ల్ కి ఉన్న ప్రాధాన్య‌త‌ను ప్ర‌త్యేకంగా ఎలివేట్ చేసింది ఈ సీజ‌న్.

2021 మ‌రింత అధ్వాన్నం. సెకెండ్ వేవ్ తో అంతా ఒణికారు. అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో ఊహించ‌న‌వి విధంగా సెకెండ్ వేవ్ ప్ర‌భావం క‌నిపించింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు ప్ర‌జానీకం. దీంతో నెమ్మ‌దిగా ప‌రిశ్ర‌మ‌లోనూ ప‌రిస్థితులు దారికొస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది స‌న్నివేశం. షూటింగులు జ‌రుగుతున్నాయి. థియేట‌ర్లు కూడా రీ ఓపెన్ అవుతున్నాయి. థ‌ర్డ్ వేవ్ భ‌యం కూడా త‌గ్గుముఖం ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో నిర్మాత‌లంతా అగ్ర హీరోల చిత్రాల్ని నేరుగా థియేట‌ర్లోనే రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారు. ప‌రిస్థితులు గ‌నుక అదుపుత‌ప్పితే ఓటీటీకే వెళ్లిపోవాల‌న్న డ్యూయ‌ల్ ప్లాన్ తో ఉన్నారు అంతా. ఏది ఎలా ఉన్నా ఇప్ప‌టికే కొంద‌రు సంక్రాంతి డేట్ల‌ను లాక్ చేసిపెట్టుకున్నాయి.

`స‌ర్కారువారి పాట‌`..`భీమ్లా నాయక్`..`ఎఫ్-3` స‌హా కొన్ని సినిమాలు సంక్రాంతి 2022 బ‌రిలో లాక్ అయ్యాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న `ఆచార్య` కూడా జ‌న‌వ‌రిలో రిలీజ్ ఫిక్సైన‌ట్లు స‌మాచారం. `ఆచార్య` షూటింగ్ పూర్త‌వ్వ‌డానికి కూడా స‌మ‌యం ప‌డుతోందని దీంతో జ‌న‌వ‌రి కి వాయిదా ప‌డిన‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఇలాంట‌ప్పుడు పాన్ ఇండియా చిత్రం `ఆర్.ఆర్.ఆర్` ప‌రిస్థితి ఏంటి? అంటే ఆ సినిమా కూడా వ‌చ్చే మార్చిలో రిలీజ్ చేయ‌డానికే ద‌ర్శ‌క‌నిర్మాత‌లు మొగ్గు చూపుతున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. వాస్త‌వానికి ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ లో రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ షూటింగ్ అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వ్వ‌డం.. తాజా ప్ర‌తికూల ప‌రిస్థితుల న‌డుమ వ‌చ్చే ఏడాదికే వాయిదా ప‌డిన‌ట్లు గుస‌గుస వినిపిస్తోంది.

ఒక‌వేళ `ఆర్.ఆర్.ఆర్` నిజంగా వాయిదా ప‌డితే మాత్రం ఈ గ్యాప్ లో చాలా సినిమాలు రిలీజ్ అయ్యే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని విశ్లేషిస్తున్నారు. అఖిల్ న‌టించిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్`.. న‌ట‌సింహ బాల‌కృష్ణ న‌టిస్తోన్న `అఖండ‌`.. మాస్ రాజా ర‌వితేజ‌ న‌టిస్తోన్న `ఖిలాడీ` స‌హా మీడియం రేంజ్ చిత్రాల‌తో పాటు.. చిన్న‌ బ‌డ్జెట్ సినిమాలు కూడా రిలీజ్ అయ్యే అవ‌కాశం ఉంటుంద‌ని విశ్లేషుకులు భావిస్తున్నారు. చాలా సినిమాలు ఓటీటీ రిలీజ్ లకు వెళ్ల‌లేక‌.. థియేట‌ర్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాయి. తెలంగాణ చాంబ‌ర్ రూల్ ని అనుస‌రించి అక్టోబ‌ర్ చివ‌రి వ‌ర‌కూ వేచి చూసాకే ఓటీటీకి వెళ్లాలి. అందుకే ప‌లువురు వేచి చూస్తున్నారు. ఇప్పుడున్న డైల‌మా క్లియరైపోతే.. థ‌ర్డ్ వేవ్ రాద‌న్న భ‌రోసా ల‌భిస్తే... చాలా సినిమాలు డిసెంబ‌ర్ లోపు రిలీజ్ అయ్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. రానా - విరాట‌ప‌ర్వం.. నితిన్ - మాస్ట్రో.. వెంకీ దృశ్యం 2 ఓటీటీకి వెళ‌తాయ‌ని టాక్ వినిపిస్తోంది. దీనిపైనా అధికారికంగా క‌న్ఫ‌ర్మేష‌న్ రావాల్సి ఉంది. ఇక ఆర్.ఆర్.ఆర్ మార్చి 2022 కి వాయిదా ప‌డింద‌నేది ఊహాగానం మాత్ర‌మే. దీనిపై చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంటుంది. ఆచార్య టీమ్ కూడా ఊహాగానాల‌కు చెక్ పెడుతూ రిలీజ్ తేదీపై స్ప‌ష్ఠ‌త‌నిస్తుందేమో వేచి చూడాలి.