Begin typing your search above and press return to search.

మొదలెట్టారు... ఆర్‌ఆర్ఆర్‌ కి కాపీ అంటించే పని షురూ!

By:  Tupaki Desk   |   31 March 2022 3:30 AM GMT
మొదలెట్టారు... ఆర్‌ఆర్ఆర్‌ కి కాపీ అంటించే పని షురూ!
X
ఈమద్య కాలంలో ఏ సినిమా వస్తున్నా.. ముఖ్యంగా భారీ చిత్రాలు ఏవి వస్తున్నా కూడా అందులోని సన్నివేశాలను.. కథను చివరకు సంగీతాన్ని అయినా ఏదో ఒక పాత సినిమాతో పోల్చుతు అదే ఇది.. కాపీ కొట్టేశారు అంటూ విమర్శలు చేసే బ్యాచ్‌ ఒకటి తయారు అయ్యింది. ప్రపంచంలో ఏదో ఒక మూలన ఉన్న సినిమాను వెదికి పట్టుకు వచ్చి మరీ ఇదుగో ఇది అదే... అదే ఇది అంటూ విమర్శించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

ఇన్ని రోజులుగా ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమాకు సంబంధించి ఎలాంటి కాపీ మరక లేదని అనుకున్నాం. కాని కాస్త ఆలస్యంగా వారు రంగంలోకి దిగారు. ఇన్ని రోజులు వారికి దొరకలేదో లేదా మరేదైనా పనిలో ఉన్నారో కాని కాస్త ఆలస్యంగా స్పందించారు. ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమాలోని రామ్‌ చరణ్ ఇంట్రడక్షన్ సన్నివేశంను ఒక సూపర్‌ హిట్‌ వరల్డ్‌ ఫేమస్ వెబ్ సిరీస్ అయిన గేమ్ ఆఫ్ థ్రోన్స్ నుండి కాపీ కొట్టారని కొందరు.. దాన్ని ఇన్సిపిరేషన్ గానే జక్కన్న ఆ సన్నివేశాన్ని డిజైన్ చేశాడు అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఒక హీరోను అది కూడా కమర్షియల్‌ హీరోను పరిచయం చేయడం రాజమౌళికి తెలిసినంతగా ఏ ఒక్క ఫిల్మ్‌ మేకర్ కు తెలియదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇండియాస్ బిగ్గెస్ట్‌ అండ్‌ బెస్ట్‌ డైరెక్టర్‌ అయిన రాజమౌళికి కాపీ మరక అంటించేందుకు ఎప్పుడు ఎవరో ఒకరు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇప్పుడు రాజమౌళి ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా ఓ రేంజ్ లో ఆడుతున్న కారణంగా ఇలాంటి ప్రచారంతో పబ్బం గడుపుకునేందుకు వారు సిద్దం అయ్యారు.

ఇలాంటి ఒక అద్బుతమైన సినిమాను ఇచ్చినందుకు గర్వించాల్సింది పోయి.. ఇన్సిపిరేషన్‌.. కాపీ అంటూ పిచ్చి కూతలు ఎందుకు అంటూ రాజమౌళి అభిమానులు సోషల్‌ మీడియాలో వారికి గట్టి సమాధానం ఇస్తున్నారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో సన్నివేశాలకు ఆర్ ఆర్ ఆర్‌ సన్నివేశానికి కాస్త పోలిక ఉన్నా హీరోల ఇంట్రడక్షన్ సన్నివేశాలు ఎక్కువ శాతం అలాగే ఉంటాయని.. అలా అని ప్రతి ఒక్కరు కాపీ కొట్టినట్లేనా... అది ఒక ఫార్ములా దాన్ని ఫాలో అవ్వడం కాపీ కాదంటూ రాజమౌళి అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.