Begin typing your search above and press return to search.
RRR మ్యూజిక్ టీమ్ RR పనిలోకి దిగారు
By: Tupaki Desk | 11 April 2021 4:51 AM GMTఏదైనా సినిమాకి సంగీతం లేదా రీరికార్డింగ్ ప్రాధాన్యత గురించి చెప్పాల్సిన పనే లేదు. చిన్న బడ్జెట్ చిత్రాలకే హాలీవుడ్ రేంజు రీరికార్డింగ్ కావాలని సంగీతం పెద్ద స్థాయిలో ఉండాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఇక ఇటీవల పాన్ ఇండియా సినిమాల కోసం దేశ విదేశాల నుంచి ప్రతిభావంతులైన సంగీత దర్శకులను దిగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణ ముగింపు దశకు చేరుకోవడంతో ఈ సినిమా రీరికార్డింగ్ సంగీతంపైనా రాజమౌళి దృష్టి సారించారని తెలుస్తోంది.
రాజమౌళి ప్రస్తుతం సినిమా సెట్స్‌కి వెళ్ళకుండా కొంత విరామం తీసుకున్నారు. పనిలో పనిగా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని పూర్తి చేస్తున్నారు. తాజాగా యువ బాలీవుడ్ సంగీతదర్శకుడు.. గాయకుడు పాటల రచయిత విశాల్ మిశ్రా (కబీర్ సింగ్ ఫేం) ట్విట్టర్ లో జక్కన్నతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేశారు. ఈ ఫోటోలో రాజమౌళితో పాటు సంగీత స్వరకర్త కీరవాణి ఉన్నారు. ``మేం ఈ రోజు స్టూడియోలో మ్యాజిక్ చేసాం. R.R.R త్వరలో వస్తుంది`` అని విశాల్ చేసిన ట్వీట్ తో ఇటీవలి రకరకాల ప్రచారానికి చెక్ పెట్టినట్టయ్యింది. ప్రస్తుతానికి ఆర్.ఆర్.ఆర్ కి పాటల పని అలాగే రీరికార్డింగ్ పనులు సాగుతున్నాయని దీనిని బట్టి క్లారిటీ వచ్చేసింది.
ఇకపోతే సోషల్ మీడియాల్లో ఆర్.ఆర్.ఆర్ చెప్పిన టైమ్ కి రావడం లేదని వాయిదా పడిందని ప్రచారమైపోతోంది. దీంతో అక్టోబర్ లో ఈ సినిమా రిలీజ్ కాదా? అన్న సందేహాల్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ వాయిదాపై చిత్రబృందం అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. ప్రస్తుతం జక్కన్న స్పీడ్ చూస్తుంటే చెప్పిన టైమ్ కి రిలీజ్ చేయడమే ధ్యేయంగా పని చేస్తున్నారని అర్థమవుతోంది. ఎన్టీఆర్- రామ్ చరణ్- అజయ్ దేవ్‌గన్ - అలియా భట్- ఒలివియా మోరిస్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. అక్టోబర్ 13 న దాసర కానుకగా సినిమా రిలీజ్ కానుంది.