Begin typing your search above and press return to search.
యూకే టాప్ 10 సినిమాల్లో RRR.. న్యూ రికార్డ్!
By: Tupaki Desk | 15 Dec 2022 12:30 PM GMTఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈసారి అత్యధిక స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి ప్రశంసలు అందుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమాను పై హాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా పాజిటివ్ గా స్పందించిన విషయం తెలిసిందే. ఇక దేశ విదేశాల నుంచి అనేక అవార్డులు కూడా అందుతున్నాయి. దర్శకదీరుడు రాజమౌళి పనితనం గురించి విదేశీ ప్రముఖులు కొనియాడుతున్న తీరు హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత మేగజైన్స్ లో కూడా ఈ సినిమాకు సంబంధించిన కథనాలు వెలువడుతున్నాయి. అంతే కాకుండా రీసెర్చ్ లో ఈ సినిమా మంచి ర్యాంక్స్ అందుకుంటోంది.
ఇటీవల ప్రముఖ బ్రిటిష్ మ్యాగజైన్ ది గార్డియన్.. 2022 లో వచ్చిన 50 ఉత్తమ చిత్రాల జాబితాను విడుదల చేయగా అందులో RRR కూడా స్థానం సంపాదించుకుంది. ఈ జాబితాలో 2022లో UKలో విడుదలైన ప్రముఖ చిత్రాలూ ఉన్నాయి. ఇక RRR ఈ ప్రతిష్టాత్మక జాబితాలో ఏడవ స్థానాన్ని పొందింది.
టాప్ గన్: మావెరిక్, గ్లాస్ ఆనియన్: ఎ నైవ్స్ అవుట్ మిస్టరీ, కౌ, ఫైర్ ఆఫ్ లవ్, ది నార్త్‌మన్, బోన్స్ అండ్ ఆల్, డెసిషన్ టు లీవ్ అనే సినిమాలతో పాటు.. ది వండర్ వంటి అనేక ప్రసిద్ధ సినిమాలను దాటి RRR కు స్థానం దక్కడం అంటే మామూలు విషయం కాదు. ఎన్నో ప్రశంసలు పొందిన చిత్రాల కంటే ఎక్కువగా RRR తన క్రేజ్ ను పెంచుకుంటోంది.
ఇక రాబోయే గోల్డెన్ గ్లోబ్స్‌లో రెండు విభాగాల్లో RRR నామినేట్ అయిన తర్వాత ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు ఆస్కార్‌లో కూడా RRR నామినేషన్ లో ఉండాలని కోరుకుంటున్నారు. అకాడమీ అవార్డుల తుది నామినేషన్‌లలో RRR ఉంటుందని కొందరు భావిస్తున్నారు.
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన RRR సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించగా జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటించారు. ఇందులో అజయ్ దేవగన్, అలియా భట్ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.