Begin typing your search above and press return to search.

RRR మ‌ళ్లీ ఎవ‌రి మీద ప‌డుతుందో?

By:  Tupaki Desk   |   2 Jan 2022 4:30 PM GMT
RRR మ‌ళ్లీ ఎవ‌రి మీద ప‌డుతుందో?
X
అవ‌తార్ విడుద‌ల త‌ర్వాత కొన్ని వంద‌ల టాస్క్ ల‌పై మీడియా క‌థ‌నాలొచ్చాయి. ఆ త‌ర్వాత తెలుగు సినీప‌రిశ్ర‌మ వ‌ర‌కూ భార‌తీయ సినిమా వ‌ర‌కూ బాహుబ‌లి ఫ్రాంఛైజీ వ‌ల్ల‌నే రికార్డుల గురించి ర‌క‌ర‌కాల ట్రేడింగ్ గురించి అంత‌గా చ‌ర్చ సాగింది. ఆ త‌ర్వాత చాలా కాలానికి ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ తేదీ అనూహ్య వాయిదాతో అంతే ఇదిగా సిద్ధాంతాలు పుట్టుకొస్తున్నాయి. 2022 మోస్ట్ అవైటెడ్ భార‌తీయ సినిమాగా ఆర్.ఆర్.ఆర్ కి హైప్ నెల‌కొన‌డంతోనే ఇదంతా.

ఆర్.ఆర్.ఆర్ సంక్రాంతి బ‌రి నుంచి వాయిదా ప‌డింది అన‌గానే.. ఈ సినిమా మ‌ళ్లీ ఎప్పుడొస్తుందో? ఉరుమొచ్చి ప‌డిన‌ట్టే ప‌డుతుందేమో! అన్న సందిగ్ధ‌త ఇప్పుడు భ‌విష్య‌త్ రిలీజ్ ల‌పై ఉంది. మునుముందు రిలీజ్ కి సిద్ధ‌మ‌వుతున్న చాలా సినిమాల‌కు ఆర్.ఆర్.ఆర్ తోనే చిక్కులు. రిలీజ్ డైల‌మాకు కార‌ణ‌మ‌వుతుంది ఈ సినిమా. ప్ర‌చారం ప‌రంగా ప్ర‌ణాళిక‌లు స‌హా ప్ర‌తిదీ మార్చుకోవాల్సి ఉంటుంది.

ప్ర‌స్తుతానికి వేసవి ప్రణాళికలో RRR టీమ్ ఉంది అన్న టాక్ వినిపిస్తోంది. జ‌న‌వ‌రిలో రాదు ఫిబ్ర‌వ‌రిలో వ‌స్తుంది అని సందేహిస్తే.. ఆచార్య 4 ఫిబ్రవరి ..మేజర్ 11 ఫిబ్రవరి .. ఖిలాడీ 11 ఫిబ్రవరి 18 పేజీస్ 18 ఫిబ్రవరి రిలీజ్ తేదీల్ని లాక్ చేసుకున్నాయి. అటు గంగూబాయి కతియావాడి ఫిబ్రవరి 18 న విడుద‌ల‌వుతోంది. ఆలియా న‌టించిన చిత్ర‌మిది. విక్రాంత్ రోనా 24 ఫిబ్రవరి .. భీమ్లా నాయక్ 25 ఫిబ్రవరికి రిలీజ్ తేదీ ఖాయం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆర్.ఆర్.ఆర్ ఫిబ్ర‌వరిలో వ‌స్తే భీమ్లా నాయ‌క్ రిలీజ్ తేదీతో స‌మ‌స్య లేకుండా జాగ్ర‌త్త ప‌డాల్సిన స‌న్నివేశం రావొచ్చేమో!

ఇక మార్చిలో డ‌జ‌ను సినిమాలు రిలీజ్ ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. పక్కా కమర్షియల్ మార్చి 18 న విడుద‌ల‌వుతోంది. గ‌ని మార్చి 18 ..రామారావు ఆన్ డ్యూటీ మార్చి 25 న విడుద‌ల కానున్నాయి. ఆర్.ఆర్.ఆర్ మార్చిలో వ‌స్తే వీట‌న్నిటికీ ఇబ్బంది.

RRR ఏప్రిల్ 2022 ఖాయ‌మైంది అనుకుంటే...సర్కారు వారి పాట ఏప్రిల్ 01 న విడుద‌ల‌వుతోంది. అదే నెల‌లో కేజీఎఫ్ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రం విడుద‌ల‌వుతోంది. KGF చాప్టర్ 2 ఏప్రిల్ 14న విడుద‌ల కానుంది. F3 ఏప్రిల్ 29న రిలీజ్ కానుంది. `హరి హర వీర మల్లు` ఏప్రిల్ 29న విడుద‌ల కానుంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన పాన్ ఇండియా మూవీగా ఇది బ‌రిలో దిగుతుంది. అంటే ఆర్.ఆర్.ఆర్ ఏప్రిల్ లో రెండు భారీ పాన్ ఇండియా చిత్రాల‌తో పోటీప‌డాల్సిన స‌న్నివేశం ఎదుర‌వుతోంది. ఆర్.ఆర్.ఆర్ - కేజీఎఫ్ - హ‌రిహ‌రి వీర‌మ‌ల్లు చిత్రాలు పాన్ ఇండియా కేట‌గిరీ చిత్రాలుగా ఒక‌దానికొక‌టి పోటీప‌డాల్సి ఉంటుంది.

నితిన్ మాచర్ల నియోజకవర్గం ఏప్రిల్ 29న విడుద‌ల‌వుతుంది. అలాగే ప్ర‌భాస్ సాలార్ జూలై 29న విడుద‌ల కానుండ‌గా..ఆదిపురుష్ ఆగస్టు 11 న విడుద‌ల‌వుతాయి. అలాగే లైగర్ ఆగస్టు 25న విడుద‌ల‌వుతుంది. ఈ సినిమాల‌కు బ‌హుశా ఆర్.ఆర్.ఆర్ తో ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌ని ఇప్ప‌టికి భావించాల్సి ఉంటుంది. ఒమిక్రాన్ టెన్ష‌న్స్ ఒక‌ట్రెండు నెల‌ల‌కే ప‌రిమిత‌మైతే ఆ త‌ర్వాత వైర‌స్ స‌న్నివేశ‌మేమిటి? అన్న‌దే ప్ర‌తిదీ డిసైడ్ చేస్తుంది. ఫ‌లానా విధంగా ఉంటుంది అని ఇప్పుడే చెప్ప‌లేం. డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్ ఇప్పుడు వైర‌స్ చేతిలో ఉంది.

ప్ర‌స్తుత స‌న్నివేశం చూస్తుంటే ఏప్రిల్ లో ఆర్.ఆర్.ఆర్ నుంచి ముప్పు కేజీఎఫ్ 2 .. హ‌రి హ‌ర వీర‌మ‌ల్లుకే ఎక్కువ అని అర్థ‌మ‌వుతోంది. అయితే రిలీజ్ తేదీల స‌ర్ధుబాటుతో ఈ ముప్పును అధిగ‌మిస్తారనే భావిద్దాం.