Begin typing your search above and press return to search.

యూఎస్‌ లో హాలీవుడ్‌ సినిమాల పక్కన మన ఆర్ఆర్‌ఆర్‌

By:  Tupaki Desk   |   26 Nov 2021 3:38 PM GMT
యూఎస్‌ లో హాలీవుడ్‌ సినిమాల పక్కన మన ఆర్ఆర్‌ఆర్‌
X
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్‌ ఆర్ సినిమా జనవరి 7వ తారీకున భారీ ఎత్తున విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజమౌళి తన సినిమాను ఎంత భారీగా తెరకెక్కిస్తాడో అంతకు మించిన ప్రమోషన్‌ ను కూడా చేస్తాడనే విషయం తెల్సిందే. ప్రమోషన్ ను కొత్త పుంతలు తొక్కించడమే కాకుండా ఎవరైతే సినిమాను సరిగ్గా జనాల్లోకి తీసుకు వెళ్లగలరో చూసి మరీ వారికి సినిమా పంపిణీ హక్కులను కట్టబెడతాడు. ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయినప్పటి నుండే యూఎస్‌ లో ఈ సినిమా ఏ స్థాయిలో విడుదల కాబోతుంది.. అక్కడ బాహుబలి రికార్డు ను బద్దలు కొట్టనుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈమద్య కాలంలో ప్రతి తెలుగు సినిమా కూడా ఓవర్సీస్ లో భారీగా విడుదల అవుతుంది. ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా ఏ రేంజ్ లో విడుదల అవుతుందో ఊహకు కూడా అందడం లేదు. అక్కడ ఏకంగా మల్టీ ప్లెక్స్ చైన్‌ థియేటర్స్ తో ఒప్పందం కుదుర్చుకుని భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. హాలీవుడ్‌ సినిమాల రేంజ్ లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. అక్కడ ఉన్న ఇండియన్స్ మాత్రమే కాకుండా అమెరికన్స్ కు కూడా సినిమాపై ఆసక్తి కలిగేలా మేకర్స్‌ అక్కడ పబ్లిసిటీ చేస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ది గాంచిన టైమ్స్‌ స్వైర్‌ వద్ద ఆర్ ఆర్‌ ఆర్ సినిమా డిజిటల్ హోర్డింగ్ ను ప్రదర్శిస్తున్నారు.

అక్కడ కేవలం హాలీవుడ్‌ సినిమాలు మరియు అంతర్జాతీయ బ్రాండ్స్ ను మాత్రమే ప్రమోట్‌ చేస్తూ ఉంటారు. అక్కడ డిజిటల్ హోర్డింగ్ కు అత్యంత ఖర్చు అవుతుంది. అయినా కూడా బయ్యర్లు సినిమా ను భారీ ఎత్తున జనాల్లోకి తీసుకు వెళ్లాలనే ఉద్దేశ్యంతో అక్కడ హోర్డింగ్‌ ను ప్రదర్శించారు. హాలీవుడ్‌ సినిమాల డిజిటల్ పోస్టర్ లు అక్కడ ఉంటే పక్కనే మన ఆర్ ఆర్‌ ఆర్‌ ఉండటం ప్రతి ఒక్క తెలుగు వాడు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క ఇండియన్‌ గర్వించే విషయం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఆర్ ఆర్ ఆర్‌ డిజిటల్‌ పోస్టర్‌ టైమ్స్ స్వైర్‌ కు సంబంధించిన ఫొటోలను తెగ షేర్‌ చేస్తున్నారు.