Begin typing your search above and press return to search.

RRR కి బాహుబలి తరహాలోక్రేజ్ రావడం లేదే

By:  Tupaki Desk   |   6 Nov 2019 4:30 AM GMT
RRR కి బాహుబలి తరహాలోక్రేజ్ రావడం లేదే
X
రాజమౌళి సినిమాల విజయంలో మిగతా అన్ని అంశాలతో పాటుగా మార్కెటింగ్ కూడా కీలకపాత్ర పోషిస్తుందని పలువురు ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం. నిజానికి బాహుబలి లో బ్లాక్ బస్టర్ అయ్యే కంటెంట్ ఉన్నమాట నిజమే కానీ దాంతో  పాటుగా అసాధారణమైన మార్కెటింగ్ వ్యూహం తోడైంది కాబట్టి ఆ రేంజ్ విజయం లభించిందని వారు చెప్తుంటారు. సినిమాలో ఉన్న ఎలాంటి అంశాలను ప్రేక్షకులకు ముందే చెప్పాలి.. ఏవి సస్పెన్స్ గా మెయింటెయిన్ చెయ్యాలి అనే విషయంలో రాజమౌళికి సాటిలేదని అంటుంటారు. ఈ విషయంలో తడబడడం వల్లే చాలామంది దర్శకులు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడుతుంటారు.

అయితే రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న 'RRR' చిత్రం విషయంలో మాత్రం ప్రస్తుతం అనుకున్నంత బజ్ లేదని అంటున్నారు. 'బాహుబలి' సినిమా ప్రకటించిన నాటి నుంచే ఆ సినిమాపై దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం కనిపించింది. ఆ సినిమా గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత ఉండేది. మొదటి భాగం ఘనవిజయం సాధించడంతో రెండవ భాగంపై దేశవ్యాప్తంగా అసాధారణమైన ఆసక్తి వ్యక్తం అయింది.  అయితే ఇప్పుడు 'RRR' విషయంలో జనాల్లో క్యూరియాసిటీ ఉంది కానీ 'బాహుబలి' రేంజ్ హైప్ మాత్రం కనిపించడం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది.

ఈమధ్య భారీ బడ్జెట్ సినిమాలు వరసగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతుండడం కూడా ప్రేక్షకుల్లో భారీ చిత్రాల పట్ల ఒక రకమైన నెగెటివిటీ ఏర్పరిచిన విషయం కూడా కొట్టిపారేయలేమని అంటున్నారు.  బడ్జెట్ 100-150 కోట్లు మాత్రమే పెట్టడం.. దాన్ని రెండుతోనూ మూడు తోనూ గుణకారం చేసి భారీ నంబర్ చెప్పడం.. ఇది ఇండియాలో హయ్యెస్ట్ బడ్జెట్ సినిమా అని బాకా ఊదడం ఒక అలవాటుగా మారడంతో ప్రేక్షకులు తెగ చిరాకు పడుతున్నారు.  ఈమధ్య చాలామంది భారీ సినిమాల నిర్మాతలు ఇలా చేయడంతోనే.. భారీ సినిమా అనగానే చాలు "బడ్జెట్  విషయంలో కాకిలెక్కలు చెప్తారు.. చచ్చినా నిజం బడ్జెట్ ఎంతో చెప్పరు" అనే ఓ అభిప్రాయం బలపడిపోయింది.   సినిమా చూడగానే ఆ క్వాలిటీ చూసి ఎంత ఖర్చు పెట్టి ఉంటారనేది చెప్పేసే మేథావులు ఎక్కువయ్యారు. ఇవన్నీ కూడా 'RRR' పై హైప్ తగ్గడానికి కారణాలు అని ఇండస్ట్రీలో ఒక టాక్ వినిపిస్తోంది.