Begin typing your search above and press return to search.
స్పెషల్ షాట్స్ తో ట్రిపుల్ ఆర్ ఓటీటీ రచ్చ రచ్చేనా?
By: Tupaki Desk | 13 May 2022 8:30 AM GMTయావత్ దేశ వ్యాప్తంగా వున్న ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన భారీ ప్రెస్టేజియస్ మల్టీస్టారర్ మూవీ ట్రిపుల్ ఆర్ ఎట్టకేలకు ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన ప్రభంజనాన్ని కొనసాగిస్తూ రికార్డుల మోత మోగించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ కాడంతో దేశ వ్యాప్తంగా వున్న సినీ ప్రియులు ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు.
మార్చి 25న విడుదలైన ఈ చిత్రం సంచలనాలు సృష్టిస్తూ విడుదలైన అన్ని భాసల్లో రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది. దక్షిణాది చిత్రాల సత్తాని మరోసారి యావత్ ప్రపంచానికి చాటి సౌత్ సినీ ఇండస్ట్రీకి సరికొత్త ఊపునిచ్చింది. పాన్ ఇండియా వైడ్ గా భారీ వసూళ్లని రాబట్టి వెయ్యి కోట్లకు మించి వసూళ్లని రాబట్టిన చిత్రాల క్లబ్ లో చేరింది. ఇదిలా వుంటే గత కొన్ని రోజులుగా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడన్నది ఆసక్తికరంగా మారింది.
దీంతో చాలా మంది ప్రేక్షకులు ఓటీటీలో మరిన్ని కొత్త సీన్ లతో సినిమా స్ట్రీమింగ్ కానుందని తెలియడంతో ఆ రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూడటం మొదలు పెట్టారు. వారి నీరీక్షణకు ఫుల్ స్టాప్ పెడుతూ `ట్రిపుల్ ఆర్` ఓటీటీ రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ తాజాగా కొత్త ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ మూవీ జీ5 లో స్ట్రీమింగ్ కాబోతున్న విషయం తెలిసిందే. హిందీ మినహా దక్షిణాది భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. మే 20న ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తున్నట్టు జీ5 వెల్లడించింది.
ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం సరికొత్త హంగులతో ముస్తాబు చేసిన `ట్రిపుల్ ఆర్` ట్రైలర్ ని విడుదల చేశారు. ఒరిజినల్ ట్రైలర్ లోని పలు సన్నివేశాలతో పాటు సినిమాలో లేని స్పెషల్ షాట్స్ తో ట్రైలర్ ని విడుదల చేయడం ఆకట్టుకుంటోంది. అడవిలో చిన్న తండా...అందులో చిరునవ్వులు పూయించే చిన్నారిని చూపిస్తూ ప్రారంభమైన ట్రైలర్ లో రామ్ - భీమ్ కలుసుకోవడం...వాళ్ల మధ్య పోరాటం..వాళ్లిద్దరూ కలిసి బ్రిటీష్ వారిపై పోరాటం చేయడం..ఇలా సినిమాలో లేని పవర్ ఫుల్ సీన్ లని ట్రైలర్ లో చూపించారు.
అంతే కాకుండా `ప్రతి తూటా మీద చచ్చేవాడి పేరు రాసుంటుంది. ప్రతి తుపాకీ మీదా పేల్చేవాడి పేరుంటుంది. యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయ్.. వంటి పవర్ ఫుల్ డైలాగ్ లతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ట్రైలర్ ని బట్టి చూస్తుంటే ఓటీటీ వెర్షన్ లో సినిమాలో చూపించని చాలా సన్నివేశాలని చూపించబోతున్నారని స్పష్టమైంది. దీంతో చాలా మంది అంట థియేటర్లలో సినిమాని చూడని వారు, చూసిన వారు కూడా ఓటీటీ వెర్షన్ కోసం విరగబడటం ఖాయంగా కనిపిస్తోంది.