Begin typing your search above and press return to search.

చెప్పిన తేదీకే 'ఆర్.ఆర్.ఆర్'..?

By:  Tupaki Desk   |   3 Jun 2021 1:30 AM GMT
చెప్పిన తేదీకే ఆర్.ఆర్.ఆర్..?
X
ప్రస్తుతం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో 'ఆర్.ఆర్.ఆర్' ముందు వరుసలో ఉంటుంది. ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజికి వచ్చేసింది. రెండు పాటలు - కొంత ప్యాచ్ వర్క్ మినహా చిత్రీకరణ దాదాపుగా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదల తేదీని ప్రకటించిన ఈ సినిమా కరోనా నేపథ్యంలో చెప్పిన సమయానికి రావడం కష్టమేనని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు చక్కబడితే ముందుగా చెప్పినట్టే ఆర్.ఆర్. ఆర్ వచ్చే అవకాశం ఉందని సీనీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రాష్ట్రాలన్నీ ఒక్కొక్కటిగా లాక్‌ డౌన్‌ సడలింపులు ఇస్తున్నారు. జూన్ రెండో వారం నుంచి సాధారణ పరిస్థితులు వచ్చేస్తాయని.. షూటింగ్స్ కూడా తిరిగి ప్రారంభమవుతాయని ఇండస్ట్రీ వర్గాలు నమ్ముతున్నాయి. అంతేకాదు ఆగస్ట్ నాటికల్లా ఎప్పటిలాగే థియేటర్లు రీ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే కనుక జరిగితే ఫెస్టివల్ సీజన్ ని వదులుకొని, కొత్త రిలీజ్ డేట్ కోసం వెతుక్కునే అవసరం లేకుండా ముందుకెళ్లాలని 'ఆర్.ఆర్.ఆర్' మేకర్స్ ఆలోచిస్తున్నారట. అందుకే వీలైనంత త్వరగా పెండింగ్ వర్క్ పూర్తి చేయాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నారట. దీనిని బట్టి చూస్తే RRR చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.