Begin typing your search above and press return to search.
RRR ఆస్కార్.. మరో మూడు రోజుల్లో తెలిపోతుంది
By: Tupaki Desk | 21 Jan 2023 3:56 AM GMTఆర్ఆర్ఆర్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఏకంగా 15 అవార్డులని గెలుచుకుంది. పలు విభాగాలలో, అలాగే పలు అంతర్జాతీయ అవార్డుల వేడుకలలో కలిపి ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్ సినిమాకి అన్ని అవార్డులు వచ్చాయి. ఇదిలా ఉంటే గోల్డెన్ గ్లోబ్ అవార్డుని కూడా ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు సాంగ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఫైనల్ ఆస్కార్ రేసు మిగిలి ఉంది. ఈ రేసులో ఎలా అయినా సత్తా చాటాలని ఆర్ఆర్ఆర్ టీమ్ భావిస్తుంది. అకాడమీ సభ్యులు నామినేట్ చేసిన చిత్రాలని ఈ నెల 24న అధికారికంగా ప్రకటించనుంది.
ఈ నెల 12 నుంచి 17 వరకు అకాడమీ సభ్యులు వీక్షించి వారి దృష్టిని ఆకర్షించిన సినిమాలలో బెస్ట్ మూవీస్ ని ఆస్కార్ కోసం అధికారికంగా నామినేటెడ్ చేస్తారు. ఇలా నామినేటెడ్ చేసిన సినిమాల నుంచి ఫైనల్ గా ఆస్కార్ అవార్డుని ఎంపిక అయిన వాటిని ఫిల్టర్ చేస్తారు. అకాడమీ సభ్యుల దృష్టిని ఆకర్షించాలంటే కచ్చితంగా ఆ సినిమాకి వరల్డ్ వైడ్ గా మంచి హైప్ ఉండాలి.
ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఉండాలి. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా వరల్డ్ వైడ్ గా రీచ్ చేయడం కోసం ఇప్పటికే రాజమౌళి గట్టిగా ప్రమోషన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రమోషన్ లో భాగంగా అంతర్జాతీయ చిత్రోత్సవాలలో పాల్గొనడమే కాకుండా హాలీవుడ్ ప్రముఖులకి స్క్రీనింగ్ చేశారు.
అలాగే అవార్డుల వేడుకలలో పాల్గొని పలు అవార్డులని గెలుచుకున్నారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా గెలవడం ద్వారా హాలీవుడ్ ప్రముఖుల దృష్టిలో ఆర్ఆర్ఆర్ సినిమా పడింది. జేమ్స్ కెమరూన్ లాంటి దిగ్గజ దర్శకుడు సైతం ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రశంసలు కురిపించారు.
ఇక చాలా మంది హాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు, ఆర్టిస్ట్స్ ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ ట్విట్టర్ లో పోస్టులు పెట్టారు. ఇలా అన్నిరకాల ప్రమోషన్స్ ద్వారా సినిమా స్థాయిని అమాంతం పెంచారు.
ఇక జపాన్ లో ఈ మూవీ సూపర్ సక్సెస్ అయ్యింది. కచ్చితంగా ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ వస్తుందని హాలీవుడ్ మ్యాగజైన్స్ ప్రముఖంగా ప్రస్తావిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాత్రం ఆస్కార్ నామినేషన్స్ కోసం ఆర్ఆర్ఆర్ ని ఎంపిక చేయలేదు. దీనిపై తాను నిరాశ చెందినట్లు రాజమౌళి చెప్పారు. అయితే అలా బాధపడుతూ ఉండకుండా ఓపెన్ కేటగిరీలో మా వైపు నుంచి ప్రయత్నం చేస్తామని ఈ రోజు ఇక్కడి వరకు చేరుకున్నామని తెలిపారు. ఇక ఆస్కార్ కి అతి సమీపంలో ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పుడు నిలిచిందని ప్రపంచ వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. మరి అవార్డు గెలుచుకొని ఆర్ఆర్ఆర్ సినిమా చరిత్ర సృష్టిస్తుందా లేదా అనేది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.