Begin typing your search above and press return to search.

RRR దేశ విదేశాల నుంచి ఎంత వ‌సూలు చేయాలి?

By:  Tupaki Desk   |   10 Oct 2021 4:30 PM GMT
RRR దేశ విదేశాల నుంచి ఎంత వ‌సూలు చేయాలి?
X
ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి తెర‌కెక్కించిన `బాహుబ‌లి` సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా దేశ విదేశాల్లో అసాధార‌ణ వ‌సూళ్ల‌ను సాధించింది. కేవ‌లం అమెరికా నుంచి 100కోట్లు పైగా వసూలు చేయ‌డం ఒక సంచ‌ల‌నం. ఆ తర‌వాత బాహుబ‌లి 2 ఓవ‌ర్సీస్ నుంచి అంత‌కుమించి వ‌సూళ్ల‌ను తెచ్చింది.

ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ కూడా అంత‌గా వ‌సూలు చేస్తుందా? అన్న చ‌ర్చా మొద‌లైంది. నిజానికి ఈ సినిమా ప్రీబిజినెస్ ఇప్ప‌టికే పూర్త‌యింది. విదేశీ హ‌క్కుల కోసం 67 కోట్ల డీల్ కుదిరింది. అయితే ఈ డీల్ పూర్త‌యి చాలా కాలం అయ్యింది కాబ‌ట్టి ఇప్ప‌టికి వ‌డ్డీలు ఇత‌ర లెక్క‌లు క‌లుపుకుని చాలా అవుతుంద‌ని అంచ‌నా. ఆ ర‌కంగా చూస్తే ఆర్.ఆర్.ఆర్ కేవ‌లం విదేశాల నుంచి 150 కోట్లు పైగా వ‌సూలు చేయాల‌ని అంచ‌నా వేస్తున్నారు.

భారీ బెట్టింగ్ తో సాహ‌సం..!

`ఆర్.ఆర్.ఆర్` ఇండియాలోనే అత్యంత‌ భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. అధికారిక లెక్క‌ల ప్ర‌కారం దాదాపు 400 కోట్ల వ‌ర‌కూ ఖ‌ర్చు అయింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. కానీ అదే మొత్తాన్ని వ‌డ్డీ క‌లిపితే మ‌రో 150 కోట్లు అద‌నంగా ఖ‌ర్చు అయింద‌ని స‌మాచారం. కోవిడ్ స‌హా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఈ ప‌రిస్థితి త‌లెత్తింద‌ని గుస‌గుస వినిపించింది. మొత్తంగా ఆర్.ఆర్.ఆర్ బ‌డ్జెట్ 550 కోట్లు అయింద‌ని ప్ర‌చారం సాగుతోంది. ఇది పాన్ ఇండియా కేట‌గిరీలో రిలీజవుతున్న‌ చిత్రం. ఈ చిత్రాన్ని కేవ‌లం తెలుగు-హిందీలో మాత్రమే తెర‌కెక్కించారు. మిగ‌తా భాష‌ల్లో అనువాద‌మ‌వుతుంది. అంటే దాదాపు స్వ‌దేశంలో అన్ని భాష‌ల్లోనూ ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అవుతోంది.

ఇంకా ఇతర దేశాల్లో `బాహుబ‌లి` త‌ర‌హాలోనే అనువాదం కానుంది. అంటే ఈ లెక్క‌న బాక్సాఫీస్ బ‌రిలోకి 1000 కోట్ల పైబ‌డిన వ‌సూళ్ల టార్గెట్ తో బ‌రిలోకి దిగాలి. అప్పుడే ఆర్.ఆర్.ఆర్ బ‌డ్జెట్... లాభాలు ఆశించ‌డానికి అవ‌కాశం ఉంది. మ‌రి ఆ ర‌కంగా చూస్తే సినిమాకు అంత స్టామినా ఉందా? అంటే దానికి కాల‌మే స‌మాధానం చెప్పాలి. ఎంత బ‌ల‌మైన స్క్రిప్ట్ అయినా హీరోల మార్కెట్ కూడా ఇక్క‌డ అత్యంత కీల‌కంగా మారాల్సి ఉంది. మ‌రి చ‌ర‌ణ్‌.. తార‌క్ బాక్సాఫీస్ స్టామినా ఎమిట‌న్న‌ది మ‌రోసారి నిరూపించుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింద‌నే అనాలి. ముఖ్యంగా హిందీ ప‌రిశ్ర‌మ నుంచి ఆర్.ఆర్.ఆర్ కి భారీగా ఆదాయం రావాల్సి ఉంటుంది. ఇక ఈ చిత్రం హిందీ రైట్స్ ..శాటిలైట్ రైట్స్ పెన్ స్టూడియోస్ కి క‌ట్ట‌బెట్టారు. పోర్చుగీస్..కొరియ‌న్..ట‌ర్కీష్‌.. స్పానిష్ భాష‌ల డిజిట‌ల్ రైట్స్ ని నెట్ ప్లిక్స్ కి అమ్మేసారు.

తెలుగు..త‌మిళం..క‌న్న‌డం..మ‌ల‌యాళం డిజిట‌ల్ హ‌క్కుల్ని జీ-5కి క‌ట్ట‌బెట్టారు. ఎన్నికోట్ల‌కు ఇప్ప‌టివ‌కూ బిజినెస్ జ‌రిగింద‌న్న‌ది తేలాల్సి ఉంది. అయితే 550 కోట్ల బ‌డ్జెట్ న‌డుమ ద‌ర్శ‌క నిర్మాత‌లపై తీవ్ర‌మైన ఒత్తిడి ఉంద‌ని గుసగుస‌ వినిపిస్తోంది. సినిమాను కోనుగోలు చేసిన ప్ర‌తీ ఒక్క‌రు లాభ‌ప‌డితేనే సినిమా హిట్ కింద లెక్క‌. ఆ లెక్క‌లో ఎక్క‌డా తేడా జ‌రిగినా రిపోర్ట్ రివ‌ర్స్ అయిన‌ట్టే. ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ తేదీపై డైల‌మా క్లియ‌రైన సంగ‌తి తెలిసిందే. 2022 సంక్రాంతి రేసులో వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇక‌పై ప్ర‌చారంలో దూకుడు..!

2022 సంక్రాంతి కానుక‌గా ఆర్.ఆర్.ఆర్ చిత్రం విడుద‌ల‌వుతుంద‌ని జ‌క్క‌న్న బృందం వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం `రౌద్రం రణం రుధిరం` ప్ర‌మోష‌న్స్ లో వేగం పెంచేందుకు జ‌క్క‌న్న బృందం స‌న్నాహ‌కాల్లో ఉంది. మిగిలి ఉన్న‌ది కేవ‌లం రెండు నెల‌లు మాత్ర‌మే. ఈ రెండు నెల‌ల్లో అన్ని భాష‌ల్ని క‌వ‌ర్ చేస్తూ ప్ర‌చారం చేయాలి. అది కూడా అక్క‌డ స్థానిక భాష‌ల్లోనే చిత్ర‌బృందం ప్ర‌చారం నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేస్తోంది. అంటే స్థానిక భాష‌ను నేర్చుకుని మ‌రీ బ‌రిలోకి దిగాల‌న్న‌ది ప్లాన్.