Begin typing your search above and press return to search.

#RRR.. పద్మావత్ - ధూమ్ 3 రికార్డులు బ్రేక్

By:  Tupaki Desk   |   9 April 2022 4:32 AM GMT
#RRR.. పద్మావత్ - ధూమ్ 3 రికార్డులు బ్రేక్
X
RRR సంచ‌ల‌నాలు కొన‌సాగుతున్నాయి. ముఖ్యంగా హిందీ బాక్స్ ఆఫీస్ ఇన్ని రోజుల త‌ర్వాత కూడా షేక్ అవుతోంది. ఈ సినిమా పద్మావత్ 3డి- ధూమ్ 3ని బీట్ చేసింది. ఆల్ టైమ్ అత్యధిక రెండవ వారం వసూళ్లలో 10వ స్థానంలో నిలిచింది. క‌రోనా క్రైసిస్ అనంత‌రం ఇది ఆస‌క్తిక‌ర ప‌రిణామం. ఈ సీజ‌న్ బిగ్గెస్ట్ హిట్ గా ఆర్.ఆర్.ఆర్ సంచ‌ల‌నం సృష్టించింది.

రామ్ చరణ్ -జూనియర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కులుగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన RRR చిత్రం రెండు వారాల క్రితం విడుదలైంది. అలాగే అలియా భట్ - అజయ్ దేవగన్ లాంటి బాలీవుడ్ స్టార్లు నటించిన ఈ చిత్రం విడుదలైనప్పటి నుండి మంచి వ‌సూళ్ల‌ను సాధిస్తోంది. బాక్సాఫీస్ వద్ద రెండు వారాల పరుగుల తర్వాత హిందీ బాక్సాఫీస్ వ‌ద్ద‌ RRR రూ. 200 కోట్ల మార్క్ వసూలు చేసి రూ. 208.59 కోట్లకు రీచ్ అయ్యింది.

RRR రెండవ వారం కలెక్షన్ లను మునుపటి విడుదలలతో పోల్చి చూస్తే.. 2వ వారంలో 76 కోట్లు వ‌సూళ్ల‌తో RRR ఆల్ టైమ్ అత్యధిక సెకండ్ వీక్ గ్రాసర్ లలో 10వ స్థానంలో నిలిచింది. వాస్తవానికి RRR రెండవ వారం వ‌సూళ్లు గతంలో విడుదలైన పద్మావత్ వంటి రూ. వసూలు చేసిన కలెక్షన్లను అధిగమించింది.

ప‌ద్మావ‌త్ 3డి చి్రం 69.50 కోట్లు క‌లెక్ట్ చేయ‌గా..అమీర్ ఖాన్ నటించిన ధూమ్ 3 రూ. 68.33 కోట్లు వ‌సూలు చేసింది. RRR కలెక్షన్లు ఇతర బిగ్ -టిక్కెట్ సినిమాల వ‌సూళ్ల‌ను అధిగ‌మించ‌లేదు కానీ క్రైసిస్ త‌ర్వాత ఇది అమోఘ‌మై ప్ర‌ద‌ర్శ‌న అని బాలీవుడ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ప్రస్తుతం RRR థియేటర్ లలో విజ‌య‌వంతంగా రన్ అవుతూనే ఉంది. లేటెస్ట్ విడుదలల నుండి ఎటువంటి పోటీ లేకుండా స్థిరంగా వ‌సూళ్ల‌ను సాధిస్తోంది. వాస్తవానికి ముందస్తు ట్రేడ్ అంచనాల ప్రకారం.. ఈ చిత్రం మూడవ వారాంతంలో రన్నింగ్ లో కూడా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందన‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

బాలీవుడ్ లో టాప్ సెకండ్ వీక్ గ్రాసర్ జాబితా ప‌రిశీలిస్తే.. బాహుబలి 2 - ది కన్‌క్లూజన్ - రూ. 143.25 కోట్లతో నంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉంది. దంగల్ - రూ. 115.96 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. కాశ్మీర్ ఫైల్స్ - రూ. 110.03 కోట్లు.. PK - రూ. 95.78 కోట్లు.. సంజు - రూ. 92.85 కోట్లు.. బజరంగీ భాయిజాన్ - రూ. 87.63 కోట్లు.. టైగర్ జిందా హై - రూ. 85.51 కోట్లు.. కబీర్ సింగ్ - రూ. 78.78 కోట్లు ..తాన్హాజీ - ది అన్‌సంగ్ వారియర్ - రూ. 78.54 కోట్లు.. RRR - రూ. 76 కోట్లు.. పద్మావత్ - రూ. 69.50 కోట్లు ..ధూమ్ 3 - రూ. 68.33 కోట్లు వ‌సూలు చేశాయి. టాప్ 10 జాబితాలో ఆర్.ఆర్.ఆర్ నిలిచింది.