Begin typing your search above and press return to search.

#RRR బిజినెస్ ఆ లెవ‌ల్లో.. 11 భాష‌ల‌కు ఎంతంటే?

By:  Tupaki Desk   |   25 March 2021 4:30 PM GMT
#RRR బిజినెస్ ఆ లెవ‌ల్లో.. 11 భాష‌ల‌కు ఎంతంటే?
X
సౌతిండియాలో రిలీజ్ ముందే అత్యంత భారీ బిజినెస్ చేసిన సినిమాల్లో ఆర్.ఆర్.ఆర్ స‌రికొత్త రికార్డులు సృష్టించ‌నుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. తాజా స‌మాచారం మేర‌కు ఈ సినిమా ఐదు భాష‌ల రిలీజ్ హ‌క్కుల డీల్ పూర్త‌యింద‌ని దాదాపు 350కోట్ల మేర బిజినెస్ సాగించార‌ని స‌మాచారం.

తెలుగు-త‌మిళం-మల‌యాళం-హిందీ-క‌న్న‌డ‌లో తొలిగా రిలీజ్ చేస్తారు. ఆ త‌ర్వాత మ‌రో ఆరు భాష‌ల్లో అనువ‌దించి ఓవ‌రాల్ గా 11 భాషల్లో రిలీజ్ చేయాల‌న్న‌ది ప్లాన్.

దీనికి నాన్ థియేట్రిక‌ల్ బిజినెస్ అద‌నం. శాటిలైట్- డిజిటల్ హ‌క్కుల‌తో పాటు ఆడియో హ‌క్కుల రూపంలోనూ మ‌రో 250 కోట్ల మేర నిర్మాత‌ల‌కు డీల్ కుదిరే అవ‌కాశం ఉంద‌ని తెలిసింది‌. స్టార్ మా- జెమిని- అమెజాన్ ప్రైమ్ ఇలా దిగ్గ‌జాలు ఆర్.ఆర్.ఆర్ స్ట్రీమింగ్ హ‌క్కుల కోసం పోటీప‌డుతున్నాయి. ఈ సినిమాకి 350-400 కోట్ల మేర బ‌డ్జెట్ ని వెచ్చిస్తున్నామ‌ని దాన‌య్య బృందం చెబుతోంది. ఆ మేర‌కు ఇప్ప‌టికే ఐదు భాష‌ల హ‌క్కుల‌తోనే వెన‌క్కి వ‌చ్చిన‌ట్టేనని తెలుస్తోంది. సుమారు బ‌డ్జెట్ పై రెట్టింపు మొత్తం నిర్మాత‌ల‌కు ద‌క్క‌నుంద‌ని భావిస్తున్నారు. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 13న ఈ చిత్రం అత్యంత భారీగా రిలీజ్ కానుంది.

ఇంత‌కుముందు బాహుబ‌లి చిత్రం 600 కోట్లు వ‌సూలు చేయ‌గా.. బాహుబ‌లి 2 చిత్రం దాదాపు 1800 కోట్లు వ‌సూలు చేసింద‌ని ప్ర‌చార‌మైంది. ఆర్.ఆర్.ఆర్ సంచ‌ల‌నాలు ఏ రేంజులో ఉండ‌నున్నాయి? అన్న‌ది వేచి చూడాలి. మ‌హ‌మ్మారీ భ‌యాలు పూర్తిగా తొల‌గిపోయి జ‌నాలు థియేట‌ర్ల‌కు వ‌స్తే ఆర్.ఆర్.ఆర్ భారీ రికార్డుల‌కు ఆస్కారం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు.