Begin typing your search above and press return to search.

ఆర్ఆర్ఆర్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంట్రెస్టింగ్‌ అప్డేట్

By:  Tupaki Desk   |   3 March 2022 3:30 PM GMT
ఆర్ఆర్ఆర్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంట్రెస్టింగ్‌ అప్డేట్
X
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల నడుమ భారీ ఎత్తున విడుదలకు సిద్దం అయ్యింది. సంక్రాంతికి విడుదల చేయాలనుకున్న ఈ సినిమా థర్డ్‌ వేవ్‌ కారణంగా చివరి నిమిషంలో వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇప్పటికే చాలా సార్లు వాయిదాలు పడ్డ ఈ సినిమా ఈసారి విడుదల అవ్వడం నూటికి నూరు శాతం పక్కా.

అందుకే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరు పెంచాలని భావిస్తున్నారు. వచ్చే వారంలో రాధేశ్యామ్‌ సినిమా విడుదల కాబోతుంది. రెండు సినిమాలకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు క్లాష్‌ అవుతాయనే ఉద్దేశ్యంతో కాస్త సైలెంట్‌ గా జక్కన్న టీమ్‌ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ సినిమా విడుదల అయిన తర్వాత అసలు స్పీడ్‌ ను పెంచే ఉద్దేశ్యంతో జక్కన్న టీం ఉన్నారట. అన్ని అనుకున్నట్లుగా జరిగితే హైదరాబాద్‌ మరియు బెంగళూరు లో భారీ ఈవెంట్‌ ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట.

ఇంతకు ముందే భారీ ప్రీ రిలీజ్ వెడుకలు మరియు ప్రెస్‌ మీట్‌ లు నిర్వహించారు. సినిమా విడుదల వాయిదా పడటం వల్ల మళ్లీ ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. సినిమాల ప్రమోషన్ లకు భారీ ఎత్తున ఖర్చు అవుతుంది. కరోనా వల్ల మేకింగ్ ఆలస్యం అవ్వడంతో బడ్జెట్‌ భారీగా పెరిగింది. ఇప్పుడు ప్రమోషన్ ను మళ్లీ మళ్లీ చేయడం వల్ల కూడా భారీగా నే ఖర్చు అవుతుందని సమాచారం అందుతోంది.

సినిమాకు భారీగా క్రేజ్‌ ఉంది.. అయినా కూడా సినిమా కోసం రెండు భారీ ఈవెంట్స్ ను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజమౌళి.. రామ్‌ చరణ్‌.. ఎన్టీఆర్ లు పాల్గొనబోతున్న ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మరో స్టార్‌ హీరో కూడా పాల్గొనబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్‌ ఈవెంట్‌ కు చిరంజీవి హాజరు అవుతాడనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.

బెంగళూరు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కు కూడా ఒక కన్నడ సూపర్ స్టార్‌ గెస్ట్‌ గా హాజరు అవుతాడని అంటున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా అద్బుతమైన విజువల్‌ వండర్ గా ఆర్ ఆర్‌ ఆర్‌ ను తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళి అంతే అద్బుతంగా సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు డిజైన్ చేస్తాడు. ఆయన టీమ్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ను అత్యంత భారీగా నిర్వహించేందుకు సిద్దంగా ఉంది.

అతి త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ లకు సంబంధించిన డేట్లను ప్రకటించే అవకాశం ఉంది. అల్లూరి మరియు కొమురం భీమ్ ల కథలతో ఈ సినిమాను రూపొందించాడు జక్కన్న. అల్లూరిగా రామ్‌ చరణ్ నటించగా కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్‌ కనిపించబోతున్నాడు. బాలీవుడ్‌ స్టార్స్‌ ఆలియా భట్ మరియు అజయ్ దేవగన్ లు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడం తో అంచనాలు మరింత భారీగా ఉన్నాయి.