Begin typing your search above and press return to search.

స‌రికొత్త చ‌రిత్ర‌కు సాక్ష్యంగా RRR ప్రీమియ‌ర్స్

By:  Tupaki Desk   |   11 March 2022 12:04 PM GMT
స‌రికొత్త చ‌రిత్ర‌కు సాక్ష్యంగా RRR ప్రీమియ‌ర్స్
X
ఇండియాన్ బాక్సాఫీస్ తో పాటు యుఎస్ ప్రిమియ‌ర్స్ స‌రికొత్త చ‌రిత్ర‌కు సాక్ష్యంగా నిల‌వ‌బోతున్నాయి. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ద‌ర్శ‌క‌ధీరుడు తెర‌కెక్కించిన అత్యంత భారీ మ‌ల్టీస్టార‌ర్ `ఆర్ ఆర్ ఆర్‌`. ఈ చిత్రం కోసం దాదాపు గ‌త మూడేళ్లు యావ‌త్ దేశం మొత్తం ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది.

ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ ఏ స్థాయి సంచ‌ల‌నాలు సృష్టించ‌బోతోంది. ఎలాంటి చ‌రిత్ర‌ని తిర‌గ‌రాయ‌బోతోంది? అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. గ‌త కొన్ని రోజులుగా రిలీజ్ వాయిదా ప‌డుతూ వ‌స్తున్న ఈ మూవీ ఎట్ట‌కేల‌కు మార్చి 25న విడుద‌ల‌వుతున్న విష‌యం తెలిసిందే.

ఇప్ప‌టికే వ‌ర‌ల్డ్ వైడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ పూర్త‌యిపోయాయి. రిలీజ్ కి స‌రిగ్గా రెండు వారాలు మాత్ర‌మే వుండ‌టంతో టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో జ‌రిగిన‌ట్టుగా తెలుస్తోంది. యుఎస్ ప్రిమియ‌ర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్ప‌టికే వ‌న్ మిలియ‌న్ క్రాస్ చేయ‌డం ఇప్పుడు స‌ర్వ‌త్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇది భార‌తీయ చిత్రాల్లోనే ఈ స్థాయిలో ఇంత ఫాస్ట్ గా ప్రీమియ‌ర్స్ కోసం టికెట్స్ బుకింగ్ కావ‌డం ఇదో మొట్ట‌మొద‌టి సారి. దీంతో ప్రీమియ‌ర్స్ బుకింగ్స్ ప‌రంగా RRR స‌రికొత్త చ‌రిత్ర‌కు సాక్ష్యంగా నిలిచింద‌ని చెప్పొచ్చు.

ప్రిమియ‌ర్స్ డేతో పోలిస్తే ఇంకా 13 రోజులే మిగిలి వున్నాయి. ఈ స‌మ‌యంలోనే వ‌న్ మిలియ‌న్ మార్కుని కేవ‌లం ప్రిమియ‌ర్స్ ద్వారానే రీచ్ కావ‌డం రికార్డుగా మారింది. క‌రోనా త‌రువాత ప‌రిస్థితులు ప్ర‌పంచ వ్యాప్తంగా సాధార‌ణ స్థితిలోకి వ‌స్తున్న నేప‌థ్యంలో తెలుగు చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌వుతున్నాయి. నేప‌థ్యంలో `RRR` ప్రీమియ‌ర్స్ ప‌రంగా స‌రికొత్త చ‌రిత్ర‌ని సృష్టించ‌డం తెలుగు వారికి ద‌క్కిన గౌర‌వంగా భావిస్తున్నారు. అంతే కాకుండా గ‌ర్వంగా కూడా ఫీల‌వుతున్నారు.

యుఎస్ లో సాధార‌ణంగా రాజ‌మౌళి చిత్రాల‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తూ వుంటుంది. బారీ ఫిగ‌ర్ ల‌ని సొంతం చేసుకుంటుంటాయి. అయితే RRR ప్రీమియ‌ర్స్ ద్వారానే అరుదైన ఫీట్ ని చేరుకోవ‌డం విశేషం. ఈ మూవీకి ఈ స్థాయిలో యుఎస్ మార్కెట్ లో క్రేజ్ పెర‌గ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఇద్ద‌రు సూప‌ర్ స్టార్ లు తొలిసారి క‌లిసి న‌టించ‌డ‌మే. ఇదే ఇప్పుడు యుఎస్ లో RRR ఫీవ‌ర్ కు ప్ర‌ధాన కార‌నంగా నిలుస్తోంద‌ని చెబుతున్నారు.

ఇదిలా వుంటే ఇప్ప‌టికే మొద‌లైన అడ్వాన్స్ బుకింగ్స్ అక్క‌డ సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయ‌ట‌. అడ్వాన్స్ బుకింగ్స్ ప‌రంగా సినిమా సంచ‌ల‌నాలు సృష్టిస్తుంటే మార్చి 25న విడుద‌ల త‌రువాత RRR సృష్టించే హంగామా ఏ రేంజ్ లో వుంటుందో ఊహించుకోవ‌డం క‌ష్టం అంటున్నాయి ట్రేడ్ వ‌ర్గాలు.

ఒక విధంగా చెప్పాలంటే ఇండియన్ సినిమాకు RRR క‌లెక్ష‌న్స్ స‌రికొత్త చ‌రిత్ర‌కు నాందిప‌ల‌క‌డం ఖాయం అని అంటున్నారు. ఏం జ‌ర‌గ‌నుందో తెలియాటంటే మార్చి 24 న మొద‌ల‌య్యే ప్రీమియ‌ర్స్ వ‌ర‌కు వేచి చూడాల్సిందే.