Begin typing your search above and press return to search.
'ఆర్.ఆర్.ఆర్' ప్రొడ్యూసర్ వెనక్కి తగ్గకపోవచ్చు..!
By: Tupaki Desk | 2 Feb 2021 5:30 PM GMTదర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. నిర్మాత డీవీవీ దానయ్య ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో పాటు 8 భారతీయ భాషల్లో రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. అయితే 'ఆర్.ఆర్.ఆర్' డేట్ అనౌన్స్ చేయడం పట్ల బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ అసహనం వ్యక్తం చేశాడు. తాను నిర్మించిన ‘మైదాన్’ చిత్రాన్ని అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్టు ఆరు నెలల ముందే ప్రకటించానని.. రెండు రోజులు ముందు 'ఆర్.ఆర్.ఆర్'ను రాజమౌళి విడుదల చేయాలనుకోవడం అన్యాయమని.. 'బాహుబలి' దర్శకుడికి ఫెస్టివల్ సీజన్ అవసరం లేదని చెప్పుకొచ్చాడు.
అయితే 'ఆర్.ఆర్.ఆర్' మేకర్స్ రిలీజ్ డేట్ విషయంలో పునరాలోచించుకునే పరిస్థితులు కనిపించడం లేదు. ఎందుకంటే ప్రతి నిర్మాత కూడా పండగ సీజన్ లో తన సినిమాని విడుదల చేస్తే అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుందని భావిస్తాడు. దానయ్య కూడా ట్రిపుల్ ఆర్ విడుదల తేదీ ప్రకటించడానికి ముందు అనేక విషయాలు లెక్కలోకి వేసుకునే ఉంటాడు. సుమారు 400 కోట్ల భారీ బడ్జెట్ పెట్టి తీసున్న సినిమాకి అదే స్థాయిలో వసూళ్ళు రావాలంటే మంచి రిలీజ్ డేట్ కూడా కుదరాలి. అందులోనూ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే మూడు సార్లు రిలీజ్ డేట్స్ మార్చుకుంది. మరోసారి విడుదల తేదీ మార్చడం అంటే మేకర్స్ కి కష్టమైన పని. దీనిని బట్టి చూసుకుంటే 'ఆర్.ఆర్.ఆర్' మేకర్స్ వెనక్కి తగ్గే అవకాశం ఉండకపోవచ్చని చెప్పవచ్చు. అయితే పండుగ సీజన్ లో రెండు మూడు సినిమాలు వచ్చినా అవి బాగుంటే మంచి వసూళ్ళు వస్తాయి. గతంలో దసరాకి రెండు మూడు పెద్ద సినిమాలు వచ్చి మంచి కలెక్షన్స్ రాబట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి.