Begin typing your search above and press return to search.
ట్రిపుల్ ఆర్ మోతే మోత
By: Tupaki Desk | 12 Dec 2021 2:30 PM GMTట్రిపుల్ ఆర్ ప్రమోషన్ స్టార్ట్ అయిపోయింది. ఒక రేంజిలో అది సాగుతోంది. దేశాన్ని చుట్టేస్తున్నారు ట్రిపుల్ ఆర్ త్రయం రాజమౌళి, చరణ్, జూనియర్ ఎన్టీయార్. ఎక్కడ చూసినా ట్రిపుల్ ఆర్ గురించి చర్చ జరిగేలా జక్కన్న మాస్టర్ ప్లాన్ వేశారు. నెల రోజుల పాటు మరే ఇతర అంశాల జోలికి వెళ్ళకుండా కేవలం ట్రిపుల్ ఆర్ నే ఆల్ ఇండియా లెవెల్ లో తలచేలా చేయాలన్నది జక్కన స్కెచ్.
దానికి తగినట్లుగానే అటు జూనియర్, ఇటు చరణ్ కూడా తమ ఫ్యూచర్ మూవీ ప్లాన్స్ ని పక్కన పెట్టి మరీ మీడియా ముందుకు వస్తున్నారు. లేటెస్ట్ గా బెంగుళూర్ లో జరిగిన ప్రెస్ మీట్ లో జూనియర్ హైలెట్ అయ్యాడు. కన్నడలో మాట్లాడి లోకల్ హార్ట్స్ ని స్వీట్ గా టచ్ చేశాడు. ఇక బాలీవుడ్ తో సహా అన్ని చిత్ర సీమలలో ఒకటికి రెండు సార్లు సినిమా రిలీజ్ కి ముందు అదరహో అన్న రేంజిలో మీడియా మీటింగ్స్ పెట్టి ట్రిపుల్ ఆర్ కి ఒక రేంజిలో పాజిటివ్ బజ్ తీసుకురావాలని రాజమౌళి ప్లాన్.
ఇవన్నీ పక్కన పెడితే ట్రిపుల్ ఆర్ కి బీ టౌన్ లో రెస్పాన్స్ ఎలా ఉంది అన్న చర్చ కూడా సాగుతోంది. బాహుబలి సీక్వెల్ కి వచ్చిన హ్యూజ్ రెస్పాన్స్ తో పోలిస్తే ట్రిపుల్ ఆర్ కి తక్కువే అన్న మాట కూడా ఉంది. బీ టౌన్ లో ట్రిపుల్ ఆర్ హంగామా మొదలైనా కూడా అనుకున్న స్థాయిలో లేదని కూడా టాక్ నడుస్తోంది.
బాహుబలి వన్ కి కూడా ఇలాగే జరిగింది అని గుర్తు చేసుకుంటున్నారు. ఒక్కసారి బొమ్మ పడిన తరువాత బ్లాక్ బస్టర్ కావడమే కాదు, 450 కోట్ల కలెక్షన్లతో అప్పటిదాకా వచ్చిన మూవీని వెనక్కి నెట్టేసింది. ఆ తరువాత వచ్చిన సీక్వెల్ ఏకంగా 1100 కోట్లను రాబట్టి ఈ రోజుకీ నంబర్ వన్ ప్లేస్ లో ఉంది.
ఇపుడు ట్రిపుల్ ఆర్ ఎలా ఉంటుంది. బాహుబలి టూ కలెక్షన్లను రీచ్ అవుతుందా, లేక దాటేస్తుందా అన్నది కూడా చర్చగా ఉంది. రాజమౌళి మాటలొనే చెప్పాలీ అంటే బాహుబలిని మించిన ఎమోషన్స్ ట్రిపుల్ ఆర్ లో ఉన్నాయట. అయితే విజువల్ వండర్ గా మాత్రం బాహుబలిని బీట్ చేయలేదు అంటున్నారు. ఇక వీటిని కూడా పక్కన పెట్టి ఆలోచిస్తే ఒక వైపు ఒమిక్రాన్ వేరియెంట్ భయం ఉంది. మరో వైపు ఆల్ ఓవర్ ఇండియా లో ఇంకా సినీ సందడి పెద్దగా ఊపందుకోలేదు.
ఈ నేపధ్యం కూడా ట్రిపుల్ ఆర్ అంచనాలను, టార్గెట్లను ఎంతో కొంత బ్రేక్ చేస్తాయా అన్న డౌట్లు ఉన్నాయి. అయితే ఇద్దరు హీరోల మల్టీస్టారర్ కి టాలీవుడ్, కోలీవుడ్ తో పాటు సౌతిండియాలో కనిపించినంత హడావుడి బీ టౌన్ లో మాత్రం లేవనే అంటున్నారు.
అయితే ఇది ఆరంభం మాత్రమేనని, సినిమా రిలీజ్ కి ముందు చివరి రెండు వారాలు విరగదీసే లెవెల్ లో ప్రమోషన్ ఉంటుందని, దాంతో హైప్ ఊపూ రెండూ ఒకేసారి వస్తాయని, బొమ్మ బీ టౌన్ లోనే దద్దరిల్లడం ఖాయమని మేకర్స్ అంటున్నారు. మొత్తానికి ట్రిపుల్ ఆర్ మోతెక్కించడం ఖాయమట.