Begin typing your search above and press return to search.
RRR ప్రమోషనల్ సాంగ్ ప్రత్యేకతలు చాలా..!
By: Tupaki Desk | 21 July 2021 11:30 PM GMTటాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో ప్రమోషనల్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. జక్కన్న సినిమా ప్రమోషనల్ సాంగ్ చాలా స్పెషల్ గా ఉంటుంది. అప్పట్లో మగధీర సినిమా ప్రమోషనల్ ను మేకింగ్ వీడియతో మిక్స్ చేసి విడుదల చేశారు. సినిమాలో కూడా ఆ పాట చివరకు వస్తుంది. ఆ పాటు చాలా స్పెషల్ గా ఉంటుంది. చిత్రంలో నటించిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు అంతా కూడా ఆ పాటలో కనిపిస్తారు.
ఆ పాట కోసం కూడా అప్పట్లో ప్రత్యేక సెట్ వేశారనే టాక్ వచ్చింది. ఇప్పుడు ఆర్‌ఆర్ఆర్ సినిమా కోసం ప్రమోషనల్ సాంగ్ ను చేస్తున్నాడు. ఈ పాటకు అనేక ప్రత్యేకతలు ఉంటాయని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఏ సినిమా ప్రమోషనల్ సాంగ్ కోసం ఖర్చు చేయనంత భారీ మొత్తం ను ఈ పాటకు ఖర్చు చేస్తున్నారట. ఈ పాటలో చిత్రంలో నటించిన వారు దాదాపుగా అంతా కూడా కనిపించబోతున్నారట. టెక్నీషియన్స్ మరియు తెర వెనుక పని చేసిన ఇంకా చాలా మందిని కూడా ఈ పాట లో చూపించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అంతే కాకుండా ఈ పాటలో సినిమా కాన్సెప్ట్ ను రివీల్ చేస్తారని కూడా అంటున్నారు.
కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా అన్ని భాషల్లో కూడా ఈ పాట ఉంటుందట. భాషకు తగ్గట్లుగా ఆ పాట మారుతుందని కూడా టాక్ వినిపిస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటీ అంటే సినిమాలోని అన్ని పాటలకు సంగీతాన్ని కీరవాణి అందిస్తున్నాడు. బ్యాక్ గ్రౌండ్ కూడా పెదన్న కీరవాణి సమకూర్చుతున్నాడు. కాని ప్రమోషనల్ సాంగ్ కు సంగీతాన్ని మాత్రం కీరవాణి సారథ్యం లో అనిరుథ్ ట్యూన్ చేయబోతున్నాడట. తెలుగు లో ఇప్పటి వరకు అనిరుధ్ కు కమర్షియల్ బ్రేక్ దక్కలేదు. అలాంటి అనిరుథ్ కు అనూహ్యంగా ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషనల్ సాంగ్ కు ట్యూన్స్ అందించే అవకాశం రావడం చాలా పెద్ద విషయంగా చెబుతున్నారు. అనిరుథ్ కు ప్రమోషల్ సాంగ్ స్పెషలిస్ట్ గా పేరు ఉంది.
ఆయన కొలవెరిడీ మొదలుకుని ఎన్నో ప్రమోషనల్ సాంగ్స్ ను చేశాడు. అందుకే ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ బాధ్యతలను రాజమౌళి ఆయనకు అప్పగించి ఉంటాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు ఈ పాటలో వేయబోతున్న స్టెప్పులు ఇతర యూనిట్ సభ్యులు చేయబోతున్న సందడి అంతా కూడా చాలా ప్రత్యేకం గా ఉంటుందనే నమ్మకం ను మీడియా వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదలకు ముందే ఈ ప్రమోషనల్ సాంగ్ ను విడుదల చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ ను వచ్చే నెల జార్జియా లో ముగించబోతున్నారు. దాంతో షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టేసినట్లే. అక్టోబర్ లో సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేశారు.
కరోనా థర్డ్ వేవ్ లేకుంటే ఖచ్చితంగా అక్టోబర్ లో సినిమా విడుదల అవ్వడం ఖాయం. ఆర్ ఆర్ ఆర్ సినిమా లో అల్లూరి సీతారామ రాజు మరియు కొమురం భీమ్ లు ఉంటారు కాని వారి కథ ఇది కాదు. జక్కన్న మొదటి నుండి చాలా సస్పెన్స్ ను కథ విషయంలో మెయింటెన్ చేస్తూ వస్తున్నారు. అదే ఇప్పుడు సినిమాపై అంచనాలు పెంచుతుంది అనడంలో సందేహం లేదు. 400 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే నిర్మాతకు కాసుల వర్షం కురిపించిందని ఇండస్ట్రీ వర్గాల టాక్. విడుదల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అని ఇప్పటి నుండే సినీ జనాలు ఊహించుకునే పనిలో ఉన్నారు.