Begin typing your search above and press return to search.
నెల ముందే RRR ప్రమోషన్స్.. ఏంటీ రీజన్?
By: Tupaki Desk | 22 Dec 2021 2:30 AM GMTరాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ `RRR`. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంటి స్టార్ లు తొలి సారి కలిసి నటించిన చిత్రం కావడంతో ఈ చిత్రంపై సహజంగానే అంచనాలు తాజా స్థాయికి చేరాయి. అంతే కాకుండా ప్రీ ఇండిపెండెంట్ కాలం నాటి ఇద్దరు వీర యోధుల కథ కావడం.. మన్యం ఈరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, గోండు బెబ్బులి కొమరం భీం పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించడం వంటి కారణాలతో ఈ సినిమా టాక్ ఆఫ్ ది ఇండియాగా మారింది.
ఇప్పటికే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అలియా భట్, అజయ్ దేవగన్, హాలీవుడ్ స్టార్ లు రే స్టీవెన్ సన్, ఒలివియా మోరీస్, అలీసన్ డూడీ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్ ఒక్కసారిగా అటెన్షన్ ని తన వైపు తిప్పేసుకుంది. ఇక సంక్రాంతి బరిలో ముందే దిగేస్తున్న ఈ సినిమా జనవరి 7న అంటే వారం ముందే సంక్రాంతి సంబరాలని థియేటర్లకు తీసుకురాబోతోంది.
ఇదిలా వుంటే రిలీజ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ని స్పీడెక్కించారు. ఆదివారం ముంబైలో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించింది చిత్ర బృందం. ఈ ఈవెంట్ కోసమే భారీ స్థాయిలో ఖర్చు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తెలుగులోనూ త్వరలో మరో ఈవెంట్ ని నిర్వహించబోతున్నారు. అయితే నెల రోజుల ముందుగానే `RRR` ప్రమోషన్స్ ని జోరుగా ప్రారంభించడంతో సగటు ప్రేక్షకుడిలో అనుమానాలు మొదలయ్యాయి.
`బాహుబలి` కోసం కేవలం వారం నుంచి పది పది హేను రోజులు మాత్రమే కేటాయించిన రాజమౌళి బాలీవుడ్ లో పప్రచారం కోసం కేవలం రెండు రోజులే కేటాయించడం.. తాజాగా `RRR` కోసం ఏకంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నే ఊహించని స్థాయిలో నిర్వహించడంతో ఏంటీ రీజన్ ఇంత టైమ్ ని కేటాయిస్తున్నా రేంటని సాధారణ ప్రేక్షకుల్లో పలు అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. తెలుగులో ప్రత్యేకంగా ఇంటర్వూలు ఇంకా మొదలుపెట్టని `RRR` టీమ్ బాలీవుడ్ మీడియాకు మాత్రం వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రచార పర్వాన్ని స్పీడెక్కించడం విడ్డూరమే అంటున్నారు.
మరో వైపు రాజమౌళి బిజినెస్ యాంగిల్ లోనే `ఆర్ ఆర్ ఆర్` ని ముందుగా బాలీవుడ్ లో భారీ స్థాయిలో ప్రమోట్ చేసి కలెక్షన్ లని కొల్లగొట్టాలనే స్ట్రాటజీ కూడా ఓ కారణం అయివుండొచ్చని.. ఆ కారణంగానే బాలీవుడ్ లో ఈ సినిమాని భారీగా ప్రమోట్ చేస్తున్నారని, `బాహుబలి`కి టైమ్ లేకపోవడం, ముందస్తుగా ప్లాన్ చేసుకోవకపోవడం వల్లే రెండు మూడు రోజుల్లో ప్రమోషన్స్ని కంప్లీట్ చేసి ఏదో చేశాం అనిపించారని, అయితే గతంలో `బాహుబలి`కి చేసిన తప్పుల్ని సరిచేసుకుంటూ `RRR` ని భారీ గా ప్రమోట్ చేయాలన్న ఆలోచనలో భాగంగానే నెల ముందుగానే ప్రమోషన్స్ ని ప్రారంభించారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సగటు ప్రేక్షకుడిలో మాత్రం ఎక్కడో కొడుతోందే.. అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. చూద్దాం జనవరి 7న ఏం జరగనుందో.