Begin typing your search above and press return to search.

RTC క్రాస్ రోడ్స్ లో RRR రేర్ రికార్డ్

By:  Tupaki Desk   |   8 May 2022 12:11 PM GMT
RTC క్రాస్ రోడ్స్ లో RRR రేర్ రికార్డ్
X
సంచ‌ల‌నాల RRR మార్చి 25న విడుదలైంది. ఇప్ప‌టికి దాదాపు 50 రోజులు కావస్తున్నా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం కొనసాగిస్తోంది. రాజమౌళి - జూనియర్ ఎన్టీఆర్- రామ్ చరణ్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన ఈ సినిమా వెయ్యి కోట్లు పైగా వ‌సూలు చేయ‌డం ఒక సంచ‌ల‌నం. మొదటి రోజు నుండి ఇది జాతీయ అంతర్జాతీయ మార్కెట్ల లో అనేక రికార్డులను బద్దలు కొట్టింది. RRR హిందీలో టాప్ 3 గ్రాస‌ర్ గా రికార్డుల్లో నిలిచింది.

ఇంత‌లోనే ఇప్పుడు మరో మైలురాయికి చేరుకుంది. ఈ చిత్రం RTC X రోడ్స్ లోని ఒకే థియేటర్ (సుదర్శన్ 35 ఎంఎం) నుండి 4 కోట్ల గ్రాస్ వ‌సూలు చేయ‌డం ఒక సంచ‌ల‌నం. ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ లో 5 కోట్ల గ్రాస్ వసూలు చేసిన తొలి సినిమాగా రికార్డులకెక్కింది. RTC X రోడ్స్‌లోని ఒకే థియేటర్ నుండి 4 కోట్లు ఒక అరుదైన రికార్డ్. ఇది ఒక అపురూపమైన రికార్డ్ అని విశ్లేషిస్తున్నారు. KGF 2 విడుదలైన తర్వాత RRR కలెక్షన్లు తగ్గిపోయినప్పటికీ ఇప్పటికీ దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మంచి వ‌సూళ్ల‌ను నమోదు చేస్తోంది.

హిందీ బెల్ట్ లో ఇప్పుడు కేజీఎఫ్2 రోజుకు 8 కోట్లు వ‌సూలు చేస్తుంటే ఆర్.ఆర్.ఆర్ 6 కోట్లు వ‌సూలు చేయ‌గ‌లుగుతోందంటే ఈ సినిమా స్టామినాని అంచ‌నా వేయొచ్చు. ద‌గ్గ‌ర‌లో హాలీవుడ్ సినిమాల రాక ఇబ్బందిక‌రంగా మారింది కానీ ఈ హ‌వా ఇలా కొన‌సాగేద‌ని కూడా విశ్లేషిస్తున్నారు. ఇటీవ‌లి కాలంలో రిపీటెడ్ ఆడియెన్ విచ్చేసిన సినిమాలేవీ అంటే ఆర్.ఆర్.ఆర్ - కేజీఎఫ్ 2 పేర్లు మాత్ర‌మే వినిపిస్తున్నాయి. మ‌రోవైపు టైగ‌ర్ ష్రాఫ్ న‌టించిన హీరో పంతి సినిమాని తొల‌గించి తిరిగి ఆర్.ఆర్.ఆర్ - కేజీఎఫ్ 2ల‌ను ఆడించేందుకు థియేట‌ర్ యాజ‌మాన్యాలు ఆస‌క్తిగా ఉన్నాయ‌ని టాక్ వినిపిస్తోంది. ఉత్త‌రాదిన స‌న్నివేశం ఈ రెండు సినిమాల‌కు ఎంతో పాజిటివ్ గా మారుతోంది.
యాక్షన్ ఎపిక్ ఆర్.ఆర్.ఆర్ లో అలియా భట్- ఒలివియా మోరిస్ - అజయ్ దేవగన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.

ద‌క్షిణాది హ‌వాకి ఎదురే లేదు!

2022లో హిందీ బాక్సాఫీస్ ని షేక్ చేసిన పాన్ ఇండియా చిత్రంగా ఆర్.ఆర్.ఆర్ రికార్డుల‌కెక్కింది. ఈ చిత్రం 6వ వారంలో ర‌న్ అవుతుండ‌గా కేజీఎఫ్ 2 మూడోవారంలో విజ‌య‌వంతంగా ర‌న్ అవుతోంది. ఇది బ‌హిందీ నుంచి RRR చిత్రం ఎంత వసూలు చేసింది? ఇప్ప‌టికి మొత్తం క‌లెక్ష‌న్స్ ఎలా ఉన్నాయి? అన్న‌ది చెక్ చేస్తే RRR హిందీ బాక్స్ ఆఫీస్ వ‌ద్ద 6వ వారంలో రూ. 5.52 కోట్లు వ‌సూలు చేసింది. ఇప్ప‌టికి మొత్తం కలెక్షన్లు రూ. 270.66 కోట్లు. ఓవ‌రాల్ గా హిందీలో 300 కోట్ల క్ల‌బ్ లో చేరుతుందా? అన్న‌ది ఇప్ప‌టికి చెప్ప‌లేని స‌న్నివేశం ఉంద‌ని విశ్లేషిస్తున్నారు. రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ నటించిన RRR చిత్రం కొద్దిరోజుల‌ క్రితం విడుదలైంది. ఈ సంవత్సరంలో అతిపెద్ద విడుదలలలో ఒకటిగా బోలెడంత హైప్ తో వ‌చ్చి 1000 కోట్ల క్ల‌బ్ లో చేరి సంచ‌ల‌నం సృష్టించింది. ఈ చిత్రంలో అలియా భట్-అజయ్ దేవగన్ కూడా నటించారు. హిందీలో భారీ ఓపెనింగ్ ల‌తో మొద‌లై క‌లెక్ష‌న్ల‌లో మంచి వృద్ధిని సాధించింది. వేగంగా రూ. 100 కోట్ల మార్క్ ని అందుకున్న చిత్రంగా ఆర్.ఆర్.ఆర్ రికార్డుల‌కెక్కింది.

ఇప్పుడు నడుస్తున్న ఆరవ వారంలో RRR మరో రూ. 5.52 కోట్లు వ‌సూలు చేసింది. దీంతో ఈ సినిమా మొత్తం కలెక్షన్లు ఇప్పుడు రూ. 270.66 కోట్లు. 2022లో రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ర్యాంక్ పొందిన RRR 300 కోట్ల మార్క్ ని అందుకుంటుందా లేదా? అన్న‌ది వేచి చూడాలని బాలీవుడ్ క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు. ఇక ఆర్.ఆర్.ఆర్ త‌ర్వాత విడుద‌లైన కేజీఎఫ్ 2 కూడా సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇక వ‌సూళ్ల రేంజును ప‌రిశీలిస్తే...RRR 6వ వారంలో 6 కోట్లు రేంజులో వ‌సూలు చేస్తుండ‌గా.. కేజీఎఫ్ 2 మూడోవారంలో 8 కోట్లు రేంజులో వ‌సూలు చేస్తోంది. ఒక రోజుకు ఈ రేంజు క‌లెక్ష‌న్లు టైగ‌ర్ ష్రాఫ్ హీరో పంతికి కూడా రాలేదు. దేవ‌గ‌న్ ర‌న్ వే 34 కి కూడా ఇంత సీన్ క‌నిపించ‌డం లేదు.

అయితే మునుముందు మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్ లో మెగా హాలీవుడ్ ఎంటర్ టైనర్ డాక్టర్ స్ట్రేంజ్ విడుదలతో RRR వ‌సూళ్లు.. కేజీఎఫ్ 2 వ‌సూళ్లు ప్ర‌భావిత‌మ‌వుతాయ‌ని భావిస్తున్నారు. వాస్తవానికి ఈ సౌత్ సినిమాలు హిందీ బాక్సాఫీస్ వ‌ద్ద మునుముందు రోజుల్లో ఎలా పోటీప‌డ‌తాయి? అన్న‌ది వేచి చూడాలి.