Begin typing your search above and press return to search.

'నెట్ ప్లిక్స్' లో ఆర్ ఆర్ ఆర్ రికార్డు!

By:  Tupaki Desk   |   1 Jun 2022 8:30 AM GMT
నెట్ ప్లిక్స్ లో ఆర్ ఆర్ ఆర్ రికార్డు!
X
ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ చిత్రంగా రిలీజ్ అయిన `ఆర్ ఆర్ ఆర్` పాన్ ఇండియా కేట‌గిరీ స‌హా ఓవ‌ర్సీస్ లో ఎంత పెద్ద స‌క్సెస్ సాధించిందో తెలిసిందే. 1200 కోట్ల వ‌సూళ్ల‌తో భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో `ఆర్ ఆర్ ఆర్` ఓ పేజీని లిఖించింది. కేవ‌లం థియేట్రిక‌ల్ ర‌న్ లోనే ఈ రేంజ్ వ‌సూళ్ల‌ని సాధించ‌డం విశేషం. ఇంకా డిజిట‌ల్ రైట్స్ రూపంలో `ఆర్ ఆర్ ఆర్` ఖాతాలో మ‌రో రికార్డు అద‌నం.

ఇక ఓటీటీలోనూ `ఆర్ ఆర్ ఆర్` విజ‌య దుందుబీ మోగిస్తోంది. జీ-5 ఓటీటీ తెలుగు స‌హా అన్నిసౌత్ లాంగ్వె జెస్ రైట్స్ ద‌క్కించ‌కుని రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. అక్క‌డా సినిమా కి మంచి ఆద‌ర‌ణ ద‌క్కుతోంది.

ఇక నెట్ ప్లిక్స్ హిందీ వెర్ష‌న్ ని రిలీజ్ చేసింది. నెట్ ప్లిక్స్ దిగ్గ‌జానికి భారతదేశం వెలుప‌లా భారీ స్థాయిని క‌లిగి ఉంది. ఇప్పుడీ క్రేజ్ తోనే `ఆర్ ఆర్ ఆర్` నెట్ ప్లిక్స్ లోనే అద్భుతాలు సృష్టిస్తోంది.

నెట్ ప్లిక్స్ లో సినిమా లైవ్ కి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి నాన్ ఇండియ‌న్స్ నుంచి ఆర్ ఆర్ ఆర్ అసాధార‌ణంగా దూసుకుపోతుంది. 18.36 మిలియ‌న్ గంట‌ల పాటు వీక్షించిన ఆంగ్లేత‌ర చిత్రంగా `ఆర్ ఆర్ ఆర్` అరుదైన రికార్డుని నెట్ ప్లిక్స్ లో సృష్టించింది. నెట్ ప్లీక్స్ స్ర్టీమింగ్ లోనే ఇది ఓ చ‌రిత్ర అని అధికారికంగా ప్రక‌టించింది.

ఇండియ‌న్ సినిమాని ఇత‌ర దేశ‌స్తులు ఈ స్థాయిలో ఆద‌రించ‌డం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. అదే వారంలో నెట్ ప్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ మూవీ `టాప్ గన్` 6.44 మిలియ‌న్ గంట‌లు అత్య‌ధికంగా వీక్షించిన చిత్రంగా ఉంది. ఇప్పుడా రికార్డుల‌న్నింటిని `ఆర్ ఆర్ ఆర్` తుడిచిపెట్టేసింది.

`ఆర్ ఆర్ ఆర్` వీక్ష‌ణ‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా సానుకూల స‌మీక్ష‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో జూన్ 1 నుంచి ఆర్ ఆర్ ఆర్ కి మ‌రింత ఆద‌ర‌ణ ద‌క్కుతుంద‌ని స్ర్టీమింగ్ దిగ్గ‌జం భావిస్తుంది. దాదాపు 100 థియేట‌ర్లో `ఆర్ ఆర్ ఆర్` రీరిలీజ్ అవుతుంది. అమెరికన్స్ నుంచి ఈసినిమా భారీ అద‌ర‌ణ ద‌క్కుతుంద‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు.