Begin typing your search above and press return to search.
# RRR రిలీజ్ టార్గెట్ .. ఆ తేదీ లాక్ చేశారు!
By: Tupaki Desk | 28 Sep 2020 12:30 PM GMT# RRR రిలీజ్ ఎపుడు? ప్రస్తుతానికి ఇదో సస్పెన్స్ సిరీస్ లా మారింది. తెలిసీ చెప్పకపోయావా? విక్రమార్కా నీ తల వెయ్యి చెక్కలగును! అని హెచ్చరించినా రిలీజ్ తేదీని ఫిక్స్ చేయలేక నానా తంటాలు పడుతున్నారు. మాయదారి మహమ్మారీ ప్రభావం ఇది. ఊహించని పిడుగులా మీద పడింది.
అయితే అన్నిటికీ చెక్ పెట్టేస్తూ 30 జూలై 2020 ఫిక్స్ చేయాలని నిర్మాత దానయ్య భావిస్తున్నారట. మార్కెట్ వర్గాలు సహా చరణ్.. ఎన్టీఆర్ అభిమానులు ఈ మూవీ రిలీజ్ వాయిదా పడకూడదనే కోరుకుంటున్నారు. అందుకే ఒక తేదీని ఫిక్స్ చేసి టార్గెట్ ఎక్స్ ని ఛేధించాలని ఒక నిర్ణయానికి వచ్చేశారట. మహమ్మారీ ఎలా ఉన్నా ఇక ఆగకుండా వేగంగా సినిమా చిత్రీకరణ అయితే పూర్తి చేయాలని ఒక నిర్ణయానికి వచ్చేశారు.
అయితే జక్కన్న అప్పటికి మూవీని పూర్తి చేయగలరా? అంటే తాజా అనాలిసిస్ ప్రకారం.. ఫిబ్రవరి నాటికి సినిమా టాకీ ని పూర్తి చేయగలిగితే వీఎఫ్.ఎక్స్ గ్రాఫిక్స్ పనుల్ని నాలుగైదు నెలల్లో కానిచ్చేసి జూలైలో రిలీజ్ చేసేయడం సాధ్యమేననేది ఓ విశ్లేషణ. కానీ రాజమౌళి ఎందులోనూ రాజీకి రారు. అందువల్ల ఇది 2022 కి వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న విశ్లేషణ సాగుతోంది.
అన్నట్టు మొదట 30 జూలై 30 విడుదల తేదీగా ప్రకటించారు. కానీ అనుకున్నదొకటి అయినదొకటి. అటుపై 2021 జనవరి 8 కి వాయిదా వేశారు. ప్రస్తుతం 30 జూలై 2021 విడుదలను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఐదారు నెలలు షూటింగుకి వెళ్లలేకపోవడం ఎన్నో చిక్కుల్ని తెచ్చింది. అయినా దేనికీ వెరవక ఇకపై లక్ష్యసాధన కోసం హార్డ్ వర్క్ చేయనున్నారని తెలుస్తోంది. మార్కెట్ వర్గాల్లోనూ నమ్మకం పెంచాలంటే ఈ కసి తప్పదని విశ్లేషిస్తున్నారు.