Begin typing your search above and press return to search.

RRR రిలీజ్ పై జ‌క్క‌న్న బృందం త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌

By:  Tupaki Desk   |   31 Aug 2021 6:32 AM GMT
RRR రిలీజ్ పై జ‌క్క‌న్న బృందం త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌
X
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌-యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కులుగా ద‌ర్శ‌క‌ధీరుడు SS రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం `ఆర్.ఆర్.ఆర్` రిలీజ్ ఇప్ప‌టికే రెండు సార్లు వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. తొలుత చిత్రాన్ని 2020 జులై 30న రిలీజ్ చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. అప్ప‌టికి షూటింగ్ సగం కూడా పూర్తికాక‌పోవ‌డం.. కొవిడ్ అడ్డంకులు వంటి ఇత‌ర‌ కార‌ణాలతో 2021 జ‌న‌వ‌రి 8కి వాయిదా వేసారు. అప్పుడు కూడా రిలీజ్ సాధ్యం కాలేదు. ఈ నేప‌థ్యంలో ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 13న రిలీజ్ చేస్తున్న‌ట్లు కొత్త ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది.

కానీ థ‌ర్డ్ వేవ్ ప‌రిస్థితుల్ని బేరీజు వేసుకుని 2022 స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయాల‌ని భావిస్తున్న‌ట్లు క‌థ‌నాలొచ్చాయి. ఇప్పుడు ఈ రెండు గాక 2022 సంక్రాంతికి స‌రిగ్గా వారం రోజుల ముందు వ‌స్తే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న‌ జ‌క్క‌న్న- దాన‌య్య మైండ్ లో ఉంద‌ని టాక్ వినిపిస్తుంది. ఈ గ్యాప్ లో చాలా సినిమాలు రిలీజ్ అయిపోతాయి. అలాగే సంక్రాంతి కి ఇంకొన్ని పెద్ద చిత్రాలు కూడా బెర్త్ లు ఖరారు చేసుకున్నాయి కాబ‌ట్టి వాటికి అడ్డంకి ఉండ‌ద‌ని భావిస్తున్నారుట‌. కార‌ణాలు ఏవైనా? వివ‌ర‌ణ‌లు ఎలా ఉన్నా అస‌లు ఎప్పుడు రిలీజ్ చేయాల‌న్న దానిపై `ఆర్.ఆర్.ఆర్` టీమ్ ఇంకా ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు క‌న‌పించ‌లేదు.

అక్టోబ‌ర్ 13 నాటికి స‌ర్వం సిద్ధ‌మై కోవిడ్ పూర్తిగా శాంతించి సాధార‌ణ పరిస్థితులు ఉంటే రిలీజ్ చేస్తారా? అన్న‌దానిపైనా క్లారిటీ లేదు. జ‌న‌వ‌రి మొద‌టి వారంలోనా.. లేక‌ స‌మ్మ‌ర్ కానుకగా రిలీజ్ చేస్తారా? అన్న‌ది తొలుత నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నిర్ణ‌యం అతి త్వ‌ర‌లోనే తీసుకునే అవ‌కాశం ఉంద‌ని మీడియాలో ప్ర‌చారం సాగుతోంది. డెసిష‌న్ త‌ర్వాత అధికారికంగా ఆ వార్త‌ను వెల్ల‌డించాల‌ని యూనిట్ కూడా వెయిట్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఆ చిత్రాన్ని అత్యంత‌ భారీ బ‌డ్జెట్ తో డి.వి.వి దాన‌య్య నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. పాట‌ల షూటింగ్ దాదాపు క్లైమాక్స్ కి చేరుకుంది. అటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. అందుకే చిత్ర‌యూనిట్ మ‌రోసారి రిలీజ్ పై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్న‌ట్లు క‌నిపిస్తోంది.

ద‌స‌రా బ‌రి నుంచి ఆర్.ఆర్.ఆర్ నిష్క్ర‌మించింది అన్న గుస‌గుస వినిపించ‌గానే వ‌రుస‌గా ప‌లు చిత్రాల్ని అక్టోబ‌ర్ లో రిలీజ్ చేసేందుకు తేదీల్ని లాక్ చేశారు. ఇందులో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ ముందు వ‌రుస‌లో ఉంది. థ‌ర్డ్ వేవ్ భ‌యం కూడా త‌గ్గుముఖం ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో నిర్మాత‌లంతా అగ్ర హీరోల చిత్రాల్ని నేరుగా థియేట‌ర్లోనే రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారు. ప‌రిస్థితులు గ‌నుక అదుపుత‌ప్పితే ఓటీటీకే వెళ్లిపోవాల‌న్న డ్యూయ‌ల్ ప్లాన్ ఉన్నా థియేట్రిక‌ల్ రిలీజ్ ఆలోచ‌న‌తో ప‌లువురు ఉన్నారు.

ఒక‌వేళ `ఆర్.ఆర్.ఆర్` నిజంగా వాయిదా ప‌డితే మాత్రం ఈ గ్యాప్ లో చాలా సినిమాలు రిలీజ్ అయ్యే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని విశ్లేషిస్తున్నారు. అఖిల్ న‌టించిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్`.. న‌ట‌సింహ బాల‌కృష్ణ న‌టిస్తోన్న `అఖండ‌`.. మాస్ రాజా ర‌వితేజ‌ న‌టిస్తోన్న `ఖిలాడీ` స‌హా మీడియం రేంజ్ చిత్రాల‌తో పాటు.. చిన్న‌ బ‌డ్జెట్ సినిమాలు కూడా రిలీజ్ అయ్యే అవ‌కాశం ఉంటుంద‌ని విశ్లేషుకులు భావిస్తున్నారు. చాలా సినిమాలు ఓటీటీ రిలీజ్ లకు వెళ్ల‌లేక‌.. థియేట‌ర్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాయి. థ‌ర్డ్ వేవ్ రాద‌న్న భ‌రోసా ల‌భిస్తే... చాలా సినిమాలు డిసెంబ‌ర్ లోపు రిలీజ్ అయ్యే అవ‌కాశం క‌నిపిస్తోంది.