Begin typing your search above and press return to search.
RRR రెస్టారెంట్లు.. ఆ ముగ్గురు కొత్త ప్లాన్?
By: Tupaki Desk | 23 Jun 2022 5:32 AM GMT'బాహుబలి' రిలీజ్ అనంతరం ఉత్పన్న వ్యాపారాల వెల్లువ గురించి తెలిసిందే. బాహుబలి టాయ్స్ తో పాటు బాహుబలి యానిమేటెడ్ బొమ్మలు.. సిరీస్ లు వగైరా బోలెడంత మార్కెట్ ని క్రియేట్ చేసాయి. ఆ తర్వాత అదే బాటలో పలువురు ఇలాంటి వ్యాపారాలు ప్రయత్నించిన సంగతి తెలిసిందే.
ఇకపోతే బాహుబలి తరహాలోనే దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన #RRR పాన్ ఇండియా కేటగిరీలో సంచలన విజయం సాధించింది. ఈ సినిమా ప్రపంచ దేశాల్లో మన్ననలు అందుకుంటోంది. సరిగ్గా ఇలాంటి సమయంలో రాజమౌళితో కలిసి రామ్ చరణ్ - రామారావు (ముగ్గురు R లు) కలిసి RRR బ్రాండ్ తో రెస్టారెంట్ చైన్ వ్యాపారాన్ని ప్రారంభించనున్నారని కథనాలొస్తున్నాయి.
నిజానికి స్నేహితులైన రామ్ చరణ్ - రామారావు లను ప్రముఖ నిర్మాత ఈ కొత్త ఆలోచనతో సంప్రదించారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరితో రాజమౌళి కూడా చేరితే బావుంటుందని ఆయన అన్నారట. అయితే ఇది ఎంతవరకూ ముందుకెళుతుంది? అన్నది ఇప్పుడే చెప్పలేం.
ప్రస్తుతం ఆ ముగ్గురూ కెరీర్ పరంగా ఎంతో బిజీ. పాన్ ఇండియా సినిమాలతో చరణ్- తారక్ బిజీ బిజీ. రాజమౌళి కి క్షణం తీరిక లేదు. ఒకవేళ RRR బ్రాండ్ తో రెస్టారెంట్ల చైన్ ని ప్రారంభించాలంటే టైటిల్ పై సర్వహక్కులు కలిగి ఉన్న నిర్మాత డివివి దానయ్య కూడా జాయిన్ కావాల్సి ఉంటుందని భావిస్తున్నారు.
అయినా ఇదంతా కేవలం స్పెక్యులేషన్ స్టేజ్ లోనే ఉంది. దీనిని గాసిప్ గానే భావించాలి. ఒకవేళ RRR పేరుతో రెస్టారెంట్ ల నిర్వహణ వ్యాపారాన్ని ప్రారంభిస్తే దానికోసం సమయాన్ని కేటాయించే సన్నివేశం ఆ ముగ్గురికీ ఉందా? అంటే ఛాన్సే లేదన్నది కూడా తెలిసినదే.
చరణ్ వరుసగా శంకర్ తో సినిమా తర్వాతా పాన్ ఇండియా సినిమాలతో బిజీ అవుతుండగా... తారక్ ప్రశాంత్ నీల్ లతో పాన్ ఇండియా మూవీ సన్నాహకాల్లో ఉన్నాడు. రాజమౌళి మహేష్ తో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు.