Begin typing your search above and press return to search.

'RRR' సీక్వెల్ : రామ్ ని త‌గ్గించి భీమ్ ని లేపుతారా?

By:  Tupaki Desk   |   4 April 2022 3:30 PM GMT
RRR సీక్వెల్ : రామ్ ని త‌గ్గించి భీమ్ ని లేపుతారా?
X
పాన్ ఇండియా చిత్రంగా ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన 'ఆర్ ఆర్ ఆర్' ఎలాంటి న‌మోదు చేసిందో తెలిసిందే. స‌రిగ్గా సినిమా రిలీజ్ అయి 10 రోజులు గ‌డిచింది. స్టిల్ 'ఆర్ ఆర్ ఆర్' వార్ య‌ధావిధిగా బాక్సాఫీస్ వ‌ద్ద కొన‌సాగుతూనే ఉంది. నేటి నుంచి త‌గ్గిన టిక్కెట్ ధ‌ర‌లు అమ‌లులోకి వ‌స్తాయి కాబ‌ట్టి ఆక్యుపెన్సీ పెరిగే అవ‌కాశం ఉంది. ఇక స‌క్సెస్ ప‌రంగా టీమ్ అంతా హ్యాపీ. ఇక అభిమానుల ప‌రంగా చూస్తే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అభిమానుల ఆనందానికైతే అవ‌ధుల్లేవ్.

చ‌ర‌ణ్ పాత్ర‌ని ఎక్కువ‌గా హైలైట్ చేసిన‌ట్లు క‌నిపిస్తుంద‌ని...తార‌క్ ని త‌గ్గించార‌ని ఉప్పొంగిపోతున్నారు. సినిమాలో రెండుల పాత్ర‌లు హైలైట్ అయినా చ‌ర‌ణ్ పాత్ర‌నే అద్భుతం అంటూ ఫ్యాన్స్ మానసిక ఆనందం పొందుతున్నారు. ఈ విష‌యంలో తార‌క్ అభిమానులు అసంతృప్తితో ఉన్న మాట వాస్త‌వం.

ఈ నేప‌థ్యంలో ఎన్టీఆర్ హ‌ర్ట్ అయ్యార‌ని..పార్టీల‌కు డుమ్మా కొట్టార‌ని ఇలా కొన్ని ర‌కాల ప్ర‌చారాలు తెర‌పైకి వ‌చ్చాయి. అలాగే 'ఆర్ ఆర్ ఆర్' కి సీక్వెల్ కూడా ఉంటుంద‌ని ప్ర‌చారం సాగుతోంది.

ఈ సీక్వెల్ లో కొమ‌రం భీమ్ పాత్ర ఎక్కువ‌గాను..అల్లూరి సీతా రామరాజు పాత్ర త‌క్కువ‌గాను ఉంటుంద‌ని..త‌ద్వారా రెండు పాత్ర‌ల్ని బ్యాలెన్స్ చేస్తార‌ని ప్ర‌చారం సాగుతోంది. తాజాగా ఈ విష‌యాల‌న్నింటిపై స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ నోరు విప్పారు. నేను సాధ్య‌మ‌య్యే సీక్వెల్ ని అన్వేషించ‌డం ప్రారంభించిన‌ప్పుడు కొన్ని ఆలోచ‌న‌లు వ‌చ్చాయి. అది కూడా అంద‌రికీ న‌చ్ల‌చింది. భ‌గ‌వంతుడు సంక‌ల్పిస్తే 'ఆర్ ఆర్ ఆర్' కి సీక్వెల్ ఉంటుంది'అని హింట్ ఇచ్చేసారు.

అలాగే చ‌ర‌ణ్‌-తార‌క్ పాత్ర‌ల మ‌ధ్య వ్య‌త్యాసంపైనా స్పందించారు. ''తార‌క్ కెరీర్ లోనే బెస్ట్ పెర్మార్మెన్స్ ఇచ్చిన చిత్రంగా 'ఆర్ ఆర్ ఆర్' నిలిచింది. ఎమోష‌న‌ల్ సాంగ్ లో తార‌క్ న‌ట‌న అద్భుతం. అత‌ని పాత్ర ఫ‌రిది త‌గ్గింది అన‌డంలో ఎలాంటి నిజం లేదు.

ప్ర‌స్తుతం చ‌రణ్-తార‌క్ విజ‌యాన్ని ఆస్వాదిస్తున్నారు. వాళ్ల‌లో ఎంతో ఉత్సాహం క‌నిపిస్తుంది. ద‌య‌చేసి ఇలాంటి అర్ధం లేని రూమ‌ర్ల‌ని క్రియేట్ చేసి వాళ్ల మ‌న‌సుకు గాయాలు త‌గిలించొద్దు. అభ‌ద్ర‌తాబావాల్ని.. వ్య‌క్తిగ‌త ఎజెండాల‌ని వాళ్ల‌పై రుద్దొద్దు'అని తెలిపారు.