Begin typing your search above and press return to search.
#RRR సెట్ ఫోటో బయటకొచ్చిందోచ్!
By: Tupaki Desk | 23 Nov 2018 5:16 AM GMTరాజమౌళి ఒక సినిమా టేకప్ చేశాడంటే ప్రేక్షకులకు దానిపై ఎంతో ఆసక్తి ఉంటుంది. జక్కన్న టీమ్ వద్దనుండి వచ్చే అప్డేట్ల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తారు. ఇక అధికారికంగా వచ్చే అప్డేట్ల తో పాటుగా అనదికారికా అప్డేట్లు.. రూమర్లు.. లీక్ అయ్యే ఫోటోలు ఇవన్నీ సర్వసాధారణం. తాజాగా రాజమౌళి తెరకెక్కిస్తున్న #RRR భారీ సెట్ల నిర్మాణం జరుగుతోందన్న విషయం తెలిసిందే కదా. అందులో ఒక సెట్ ఫోటో బయటకు వచ్చింది.
పై ఫోటోలో కనబడుతున్న సెట్ నిర్మాణం ప్రస్తుతం సీబీఐటీ కాలేజీకి సమీపంలో జరుగుతోందట. ఈ సెట్ నిర్మాణం పూర్తయిన తర్వాత మూడు నెలల పాటు షూటింగ్ జరుగుతుందట. ఈ సెట్ వాలకం చూస్తుంటే బ్రిటిష్ కాలం నాటి బిల్డింగ్ అనే అనిపిస్తోంది. #RRR కథ స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంలో ఉంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి కాబట్టి ఈ సెట్ నిర్మాణం ఆ వార్తలకు బలం చేకూరుస్తోంది.
ఇప్పటికే ఈ సెట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. కథ వివరాలు సెట్లకు సంబంధించిన ఫోటోలు బయటకు రాకుండా రాజమౌళి అండ్ టీం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని వార్తలు వస్తున్నాయిగానీ వాటితో సంబంధం లేకుండా ఈ సెట్ ఫోటోలు లీక్ కావడం విచిత్రమే. ఇదిలా ఉంటే #RRR రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 19 నుండి ప్రారంభం అయింది. మొదటి షెడ్యూల్ లో చరణ్ - తారక్ లపై ఒక భారీ యాక్షన్ బ్లాక్ ను రాజమౌళి చిత్రీకరిస్తున్నాడట.