Begin typing your search above and press return to search.

ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ పరిస్థితి ఏంటి !

By:  Tupaki Desk   |   16 April 2020 6:15 AM GMT
ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ పరిస్థితి ఏంటి !
X
దర్శకధీరుడు రాజమౌళి రెండేళ్ల గ్యాప్ తీసుకొని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా 'ఆర్'ఆర్'ఆర్'. యావత్ భారతదేశ సినీ అభిమానులు 'ఆర్.ఆర్.ఆర్' సినిమా విడుదల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. నిజానికి ఈ సినిమాని మొదటగా ఈ సంవత్సరం జూలై 30న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ రాజమౌళి, చిత్ర నిర్మాతలు మీడియా ముఖంగా తెలుపగా.. అది కాస్తా దసరాకి షిప్ట్ అయింది. కానీ కొన్ని షూటింగ్ పనులు వాయిదా ఉండడంతో వచ్చే ఏడాది 2021 జనవరి 8కి వాయిదా వేయడం జరిగింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో సినిమా షూటింగ్ పూర్తిగా నిలిపి వేయడం జరిగింది. మళ్లీ తిరిగి షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతారో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. లాక్ డౌన్ మే 3 వరకు అంటే మరో మూడు వారాలు పొడిగించిన నేపథ్యంలో సినిమా షూటింగులన్నీ జులై నెల దాకా స్టార్ట్ అయ్యే అవకాశాలు లేవు. మూవీ షూటింగ్స్ డిలే అయితే సినిమా రిలీజ్ డేట్స్ కూడా ఖచ్చితంగా వాయిదా పడతాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

రాజమౌళి, డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తామని ప్రకటించినా ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఇది సాధ్యపడేలా కనిపించడం లేదు. వచ్చే ఏడాది సంక్రాతి కానుకగా జనవరి 8న విడుదల కానున్న ఈ చిత్రం వాయిదా పడబోతోంది అంటూ ఈ మధ్య మళ్ళీ వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేయొచ్చని ఇప్పుడు మరో రిలీజ్ డేట్ బయటకి వస్తోంది. 2017 ఏప్రిల్ 28 రాజమౌళి రూపొందించిన 'బాహుబలి' సినిమా రిలీజ్ అయిన రోజు. ఈ సినిమా ఎంతటి సంచలనాలను క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ అదే రోజున ఆర్.ఆర్.ఆర్ సినిమా విడుదల చేస్తే సెంటిమెంట్ కూడా వర్క్ అవుట్ అవుద్దని కొంతమంది జక్కన్నకి సలహా ఇస్తున్నారట.

అయితే జక్కన్న మాత్రం ఇప్పటికే మేజర్ షూటింగ్ అయిపోయిందని కేవలం నెల రెండు నెలల షూటిండ్ మాత్రమే బాలన్స్ ఉందని.. లాక్ డౌన్ ఎత్తేస్తే ఒక వైపు చిత్రీకరణ జరుపుతూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేయొచ్చనే కాన్ఫిడెంట్ తో ఉన్నాడట. అంతేకాకుండా ఒకసారి షూటింగ్ కంప్లీట్ అయితే ఇక పూర్తిగా వీ.యప్.ఎక్స్ పనులు చేసుకోవచ్చని రాజమౌళి అభిప్రాయ పడుతున్నాడట. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి. రాజమౌళి అనుకున్నట్లు జరిగితే సంక్రాంతికే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లేదంటే బాహుబలి డేట్ గురించి ఆలోచించే అవకాశాలున్నాయని ఫిల్మ్ నగర్ టాక్.