Begin typing your search above and press return to search.

'ఆర్.ఆర్.ఆర్' షూట్ లేటెస్ట్ అప్డేట్..!

By:  Tupaki Desk   |   19 May 2021 5:30 PM GMT
ఆర్.ఆర్.ఆర్ షూట్ లేటెస్ట్ అప్డేట్..!
X
కరోనా సెకండ్ వేవ్ విజృంభనతో పెద్ద సినిమాల షూటింగ్స్ అన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పరిస్థితులు చక్కబడి ఎప్పుడు షూటింగ్ మొదలవుతుందో.. అది ఎలా విడుదలవుతుందో చెప్పలేకున్నారు. ఈ ఎఫెక్ట్ ఎక్కువగా పడిన సినిమాలో 'ఆర్.ఆర్.ఆర్' ఒకటి. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఈ సినిమా మరింత లేట్ అవుతోంది.

నిజానికి RRR చిత్రాన్ని 2020 జూలై 30న విడుదల చేస్తామని అప్పట్లో మీడియా ముఖంగా ప్రకటించారు. షూటింగ్ లేట్ అవుతుండటంతో అది కాస్తా దసరాకి షిప్ట్ అయిందన్నారు. ఇదే క్రమంలో కరోనా కారణంగా చిత్రీకరణ మిగిలి ఉండటంతో 2021 జనవరి 8కి విడుదల వాయిదా వేశారు. పరిస్థితులు అనుకూలించకపోవడంతో చివరకు ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఇప్పుడు సెకండ్ వేవ్ ప్రభావంతో చెప్పిన తేదీకి విడుదల చేసే అవకాశాలు లేవని అర్థం అవుతోంది.

అయితే రిలీజ్ ఎప్పుడనేది క్లారిటీ లేనప్పటికీ.. 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ దాదాపుగా పూర్తయిందని తెలుస్తోంది. ఇంకో మూడు నాలుగు రోజులు ప్యాచ్ వర్క్ చిత్రీకరణ జరిపితే టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోతుందట. అలానే ఓ మూడు పాటల షూటింగ్ కూడా బ్యాలెన్స్ ఉందని తెలుస్తోంది. ఇందులో ఒకటి రామ్ ‌చరణ్‌ - ఆలియా భట్ లపై చిత్రీకరించాల్సి ఉండగా.. దీని కోసం ఇప్పటికే సెట్ రెడీగా ఉందని సమాచారం. మరొక సాంగ్ సినిమా నేపథ్యాన్ని వివరించేదిగా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట.

ఎన్టీఆర్ కు కరోనా సోకకుండా ఉండి.. లాక్ డౌన్ పెట్టకుండా ఉంటే ఈపాటికే బ్యాలన్స్ షూట్ దాదాపుగా కంప్లీట్ చేసేవారని తెలుస్తోంది. సారధి స్టూడియో మరియు అన్నపూర్ణ స్టూడియోలోనూ ఇప్పటికే నిర్మించిన సెట్స్ లో ఈ షూటింగ్ తిరిగి ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ కార్యక్రమాలు మొదలవుతాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.