Begin typing your search above and press return to search.

#RRR కు ఇంకా గుమ్మడి కాయ కొట్టలేదా?

By:  Tupaki Desk   |   4 Sep 2021 5:56 AM GMT
#RRR కు ఇంకా గుమ్మడి కాయ కొట్టలేదా?
X
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా విడుదల తేదీ విషయంలో స్పష్టత కరువయ్యింది. అక్టోబర్ లో సినిమా విడుదల అంటూ కొన్ని నెలల ముందు ప్రకటించారు. మొన్నటి వరకు కూడా దసరా కానుకగానే ఆర్ ఆర్‌ ఆర్‌ వస్తుందని అభిమానులు ఆశించారు. కాని పరిస్థితులు చూస్తుంటే దసరా సీజన్ లో ఈ భారీ మల్టీ స్టారర్ రాదని కన్ఫర్మ్‌ అయ్యింది. అతి త్వరలో ప్రెస్ మీట్‌ ఏర్పాటు చేసి విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినట్లుగా ఆ మద్య మీడియాలో వార్తలు వచ్చాయి.

సినిమా షూటింగ్‌ పూర్తి అయినట్లుగా కొన్ని వారాల క్రితం జక్కన్న కేక్‌ కట్‌ చేసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో కనిపించాయి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మెయిన్ కాస్టింగ్ కాకుండా ఇతర నటీ నటులతో జూనియర్ ఆర్టిస్టులతో సినిమా షూటింగ్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది అనుకుంటున్న వారికి ఇది ఒకింత షాకింగ్ గా అనిపించవచ్చు. జక్కన్న ఇంకా ఎన్నాళ్లు ఈ సినిమాను చెక్కుతాడు అంటూ కొందరు పెదవి విరుస్తుండగా ఇప్పుడు ఎలాగూ విడుదల లేదు కనుక ప్రతి సన్నివేశం కూడా అత్యంత పర్ఫెక్షన్‌ తో ఉండాలని జక్కన్న భావించడం మంచి విషయమే అన్నట్లుగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

రాజమౌళి దర్శకత్వంలో గతంలో వచ్చిన బాహుబలి సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి చాలా కాలం అయ్యింది. కరోనా వల్ల మరింత ఆలస్యం అవుతుంది. ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌ వంటి ఇద్దరు బడా స్టార్స్ నటించిన సినిమా అవ్వడం వల్ల టాలీవుడ్ అభిమానులు.. రాజమౌళి దర్శకత్వంలో రూపొందడం వల్ల అన్ని భాషల ప్రేక్షకులు సినిమాపై చాలా నమ్మకం పెంచుకున్నారు. షూటింగ్ పూర్తి అయ్యింది. ఎప్పుడైనా సినిమా విడుదల తేదీ ప్రకటించే అవకాశం ఉంటుందని భావిస్తున్న తరుణంలో మళ్లీ షూటింగ్‌ చేస్తున్నారు అంటూ వస్తున్న వార్తలు కాస్త అసంతృప్తిని కలిగిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ కు ఇంతకు గుమ్మడి కాయ కొట్టేది ఎప్పుడు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.