Begin typing your search above and press return to search.
సంక్రాంతి కానుకగా RRR స్పెషల్ పోస్టర్..!
By: Tupaki Desk | 14 Jan 2022 5:18 AM GMTదర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బిగ్గెస్ట్ ఫిక్షనల్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ''ఆర్.ఆర్.ఆర్''. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ కోసం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పరిస్థితులు అనుకూలించి అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఇప్పటికే ఈ సినిమా థియేటర్లలో సంచలనం సృష్టిస్తూ ఉండేది. ఈరోజు సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ సినిమా హాళ్ల దగ్గర జరుగుతూ ఉండేవి.
RRR చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా 2022 జనవరి 7న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసారు. దీనికి తగ్గట్టుగానే భారీగా ప్రమోషనల్ ఈవెంట్స్ నిర్వహించారు. అయితే దేశవ్యాప్తంగా కరోనా మరియు ఓమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో సినిమా విడుదల వాయిదా వేసాయి. సినీ ప్రియులు కాస్త నిరాశ చెందినప్పటికీ, పరిస్థితులను బట్టి మేకర్స్ మంచి నిర్ణయమే తీసుకున్నారని సర్దిచెప్పుకున్నారు.
సంక్రాంతి కానుకగా ప్రేక్షకులకు సినిమాను అందించలేకపోయిన RRR బృందం.. పండుగ శుభాకాంక్షలు చెబుతూ శుక్రవారం సరికొత్త పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఇందులో ఎన్టీఆర్ ముస్లిం యువకుడి వేషధారణలో మెడ మీద కర్ర పట్టుకొని సందడి చేయగా 1920స్ నాటి డ్రెస్సింగ్ లో కనువిందు చేశారు. ఈ సందర్భంగా మేకర్స్ ట్వీట్ చేస్తూ త్వరలోనే థియేటర్లలో కలుస్తామని పేర్కొన్నారు.
కాగా, విప్లవవీరులు అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ నిజ జీవిత స్వభావాల ఆధారంగా కల్పిత కథతో 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని తెరకెక్కించారు. రామరాజుగా చరణ్.. భీమ్ గా తారక్ కనిపించనున్నారు. అలియా భట్ - ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా.. అజయ్ దేవగన్ - శ్రియా శరణ్ - సముద్ర ఖని కీలక పాత్రలు పోషించారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేసారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో ఈ పాన్ ఇండియా మూవీని నిర్మించారు.