Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ః ప్రయాణంకు సిద్దంగా ఉన్న ఆర్ అండ్ ఆర్‌

By:  Tupaki Desk   |   10 Dec 2021 12:00 PM IST
ఫొటోటాక్ః ప్రయాణంకు సిద్దంగా ఉన్న ఆర్ అండ్ ఆర్‌
X
దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని ప్రస్తుతం ప్రమోషన్‌ కార్యక్రమాలతో జోరుగా ముందుకు సాగుతున్న చిత్ర యూనిట్‌ సభ్యులు సినిమాపై అంచనాలు మరింతగా పెంచుతున్నారు. తాజాగా తెలుగు లో ట్రైలర్ విడుదల కార్యక్రమం జరిగింది.

ముంబయిలో కూడా ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం సాగింది. నేడు బెంగళూరు మరియు చెన్నైల్లో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగబోతున్నాయి. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఇద్దరు హీరోలు కలిసి రాబోయే రెండూ ముడు వారాలు చక్కర్లు కొట్టబోతున్నారు. అందులో భాగంగానే నేడు ఉదయం ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌ లు ఇలా విమానాశ్రయం వద్ద కనిపించారు.

బెంగళూరు మరియు చెన్నైల్లో నిర్వహించబోతున్న ప్రెస్ మీట్ లకు వీరు వెళ్తున్నారు. అక్కడ ట్రైలర్ రిలీజ్ సందర్బంగా అభిమానులతో ముచ్చటించబోతున్నారు. మీడియా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. సినిమా ప్రమోషన్‌ లో భాగంగా ఇద్దరు హీరోలు ఇలా మీడియాలో కనిపిస్తేనే అభిమానులు ఆహా ఓహో అంటున్నారు.

అదే ముందు ముందు సినిమా లో ఇద్దరిని కలిపి చూసి ప్రమోషన్ లో భాగంగా ఇద్దరు పదే పదే మీడియా ముందుకు వస్తే అభిమానుల ఆనందంకు హవదులు ఉండే అవకాశం లేదు. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా ను మన దేశంలోనే కాకుండా పలు దేశాల్లో కూడా విడుదల చేయబోతున్నారు. ఇండియన్‌ భాషలు మాత్రమే కాకుండా ఇతర విదేశీ భాషల్లో కూడా సినిమాను విడుదల చేస్తారని అంటున్నారు.

ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌ లు ఈ సినిమా లో కొమురం భీమ్ మరియు అల్లూరి సీతారామరాజు పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ ఉద్యమ హీరోల జీవిత చరిత్ర అందరికి తెల్సిందే. కాని ఈ వీరుల పాత్రలను తీసుకుని కల్పిత కథతో ఈ సినిమాను రూపొందించినట్లుగా జక్కన్న చెప్పుకొచ్చాడు.

అన్నట్లుగానే ఈ సినిమాను చాలా విభిన్నమైన కథతో తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన అంచనాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితులు చూస్తుంటే వసూళ్ల విషయంలో బాహుబలి 2 ను కూడా క్రాస్ చేసినా ఆశ్చర్యం లేదు అంటున్నారు.