Begin typing your search above and press return to search.

ఈ వ‌సూళ్లు చూశాక RRR టీమ్ డెసిషన్ ఏమిటో?

By:  Tupaki Desk   |   20 Aug 2021 1:23 PM GMT
ఈ వ‌సూళ్లు చూశాక RRR టీమ్ డెసిషన్ ఏమిటో?
X
క‌రోనా క్రైసిస్ భ‌యాలు పూర్తిగా తొల‌గిపోయిన‌ట్టేనా? ఇక‌పై థియేట‌ర్ల‌కు జ‌నం సినిమాలు చూసేందుకు వ‌స్తారా? అన్నిచోట్లా థియేట‌ర్ల‌ను తెరిచేందుకు ప్ర‌భుత్వాలు అనుమ‌తులు ఇస్తున్నాయి. ఇక‌పై సినీరంగం భ‌విష్య‌త్ ఎలా ఉంటుందో? అంటూ ర‌క‌ర‌కాల కోణాల్లో ఆరాలు సాగుతున్నాయి.

ఇంత‌లోనే టాలీవుడ్ లో చోర చోర రాజా .. బాలీవుడ్ లో బెల్ బాట‌మ్ లాంటి క్రేజీ సినిమా రిలీజ‌య్యాయి. అయితే ఈ రెండు సినిమాల‌కు రివ్యూలు బావున్నాయి. సినిమాలు బావున్నాయి... న‌టీన‌టుల ప్ర‌ద‌ర్శ‌న అద్భుతం అంటూ ట్విట్ట‌ర్ స‌హా సోష‌ల్ మీడియాల్లో ప్ర‌శంస‌లు కురిపిస్తూ మినీ రివ్యూలు ద‌ర్శ‌న‌మిచ్చాయి. శ్రీ‌విష్ణు లాంటి రైజింగ్ హీరో న‌టించిన రాజ రాజ చోర తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ను తెస్తోంద‌న్న టాక్ ఉంది. అటు బాలీవుడ్ లో అక్ష‌య్ కుమార్ న‌టించిన బెల్ బాట‌మ్ కి రివ్యూలు బావున్నా.. డే1 ఓపెనింగ్ వ‌సూళ్లు మాత్రం తీవ్రంగా నిరాశ‌ప‌రిచాయి. ఈ సినిమాకి ఓవ‌రాల్ గా 10కోట్ల వ‌సూళ్లు మొద‌టి రోజు ద‌క్క‌డం క‌ష్టం గా క‌నిపిస్తోంద‌న్న రిపోర్ట్ అందింది. దిల్లీ.. గుజ‌రాత్ లాంటి చోట్ల నుంచి 2-3కోట్ల మేర వసూళ్లు సాధించ‌గా ఇటు మ‌హారాష్ట్ర వ్యాప్తంగా థియేట‌ర్లు తెరుచుకోక‌పోవ‌డంతో ఆ ప్ర‌భావం బెల్ బాట‌మ్ వ‌సూళ్ల‌పై తీవ్రంగా ప‌డింది.

పాజిటివ్ స‌మీక్ష‌లు వ‌చ్చాక కూడా జ‌నం థియేట‌ర్ల‌కు రాలేని ప‌రిస్థితి ఉందంటే మ‌రి ఈ సీజ‌న్ లో సినిమాలు రిలీజ్ చేయాలా వ‌ద్దా? అన్న‌ది కూడా ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఆగష్టు 19 న చాలా పెద్ద గ్యాప్ తర్వాత సినిమాస్ లో విడుదలైన మొదటి పెద్ద బాలీవుడ్ సినిమా బెల్ బాట‌మ్. ఈ ఏడాదిలో స్టార్ వ్యాల్యూ ఉన్న సినిమా కూడా ఇదే. కానీ వ‌సూళ్లు మ‌రీ దారుణం 3 కోట్ల లోపు నెట్ వ‌సూల‌వ్వ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంద‌ని విశ్లేషిస్తున్నారు.

అయితే బెల్ బాట‌మ్ మునుముందు రిలీజ్ ల‌కు రెడీ కానున్న పాన్ ఇండియా సినిమాల‌కు హెచ్చ‌రిక లాంటిది. ఇక‌పైనా గంగూభాయి క‌తియా వాడీ- బ్ర‌హ్మాస్త్ర‌- ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ చిత్రాలు రిలీజ్ కి రానున్నాయి. అయితే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో పాన్ ఇండియా లెవ‌ల్లో రిలీజ్ చేస్తే చిక్కులు ఎదుర్కోక త‌ప్ప‌దేమో! అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇక‌పోతే ఇప్పుడున్న క్రైసిస్ నేప‌థ్యంలో ఆర్.ఆర్.ఆర్ ద‌స‌రా బ‌రి నుంచి త‌ప్పుకుంద‌ని ఇప్ప‌టికే క‌థ‌నాలొస్తున్నాయి. 1 ఏప్రిల్ 2022 న ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి వస్తుందని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే దీనిని చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంటుంది.

వాయిదా కోసం వెయిటింగ్:

2021 మోస్ట్ అవైటెడ్ మూవీ ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ తేదీపై చిత్ర‌బృందం మ‌రోసారి అధికారికంగా ప్ర‌క‌టించేవ‌ర‌కూ స‌స్పెన్స్ త‌ప్పేట్టు లేదు. వాయిదానా.. య‌థాత‌థంగా చెప్పిన తేదీకే రిలీజ‌వుతుందా? అన్న‌దానిపై స్ప‌ష్ఠ‌త లేదు. ఒక‌వేళ `ఆర్.ఆర్.ఆర్` నిజంగా వాయిదా ప‌డితే మాత్రం ఈ గ్యాప్ లో చాలా సినిమాలు రిలీజ్ అయ్యే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని విశ్లేషిస్తున్నారు. అఖిల్ న‌టించిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్`.. న‌ట‌సింహ బాల‌కృష్ణ న‌టిస్తోన్న `అఖండ‌`.. మాస్ రాజా ర‌వితేజ‌ న‌టిస్తోన్న `ఖిలాడీ` స‌హా మీడియం రేంజ్ చిత్రాల‌తో పాటు.. చిన్న‌ బ‌డ్జెట్ సినిమాలు కూడా రిలీజ్ అయ్యే అవ‌కాశం ఉంటుంద‌ని విశ్లేషుకులు భావిస్తున్నారు. చాలా సినిమాలు ఓటీటీ రిలీజ్ లకు వెళ్ల‌లేక‌.. థియేట‌ర్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాయి. తెలంగాణ చాంబ‌ర్ రూల్ ని అనుస‌రించి అక్టోబ‌ర్ చివ‌రి వ‌ర‌కూ వేచి చూసాకే ఓటీటీకి వెళ్లాలి. అందుకే ప‌లువురు వేచి చూస్తున్నారు. ఇప్పుడున్న డైల‌మా క్లియరైపోతే.. థ‌ర్డ్ వేవ్ రాద‌న్న భ‌రోసా ల‌భిస్తే... చాలా సినిమాలు డిసెంబ‌ర్ లోపు రిలీజ్ అయ్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. రానా - విరాట‌ప‌ర్వం.. నితిన్ - మాస్ట్రో.. వెంకీ దృశ్యం 2 ఓటీటీకి వెళ‌తాయ‌ని టాక్ వినిపిస్తోంది. దీనిపైనా అధికారికంగా క‌న్ఫ‌ర్మేష‌న్ రావాల్సి ఉంది. ఇక ఆర్.ఆర్.ఆర్ మార్చి 2022 కి వాయిదా ప‌డింద‌నేది ఊహాగానం మాత్ర‌మే. దీనిపై చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంటుంది.