Begin typing your search above and press return to search.
అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చిన `ఆర్ ఆర్ ఆర్` టీమ్
By: Tupaki Desk | 1 March 2022 8:30 AM GMTటాలీవుడ్ లో అత్యంత క్రేజీ మూవీ గా నిలిచిన చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. ఈ సినిమా కోసం ప్రేక్షకులు దాదాపు రెండున్నరేళ్లుగా ఎదురుచూస్తున్నారు. తాజాగా చిత్ర బృందం శివరాత్రి సందర్భంగా ప్రేక్షకులని సర్ ప్రైజ్ చేసింది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే హాట్ టాపిక్ గా నిలిచిన ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటించడం.. `బాహుబలి` వంటి సంచలన చిత్రం తరువాత రాజమౌళి నుంచి రానున్న భారీ మల్టీస్టారర్ మూవీ కావడం.. ప్రీ ఇండిపెండెన్స్ ఎరా నేపథ్యంలో 1920 కాలం నాటి కథతో ఈ మూవీని రూపొందించిన తీరు, స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారిపై వీరోచిత పోరాటం చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు.. నైజాం నవాబ్ మెడలు వంచి హడలెత్తించిన గోండు బెబ్బులి కొరమరం భీం ల కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు సినిమాపై అంచనాల్ని పెంచేసింది.
దేశ వ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్ ని హాట్ టాపిక్ గా మారేలా చేసింది. 2020 జూలై 30న విడుదల కావాల్సిన ఈ క్రేజీ మల్టీస్టారర్ ని ఆ తరువాత నుంచి వరుసగా రిలీజ్ డేట్స్ మారుతూ వస్తోంది. ఇటీవల జనవరి 7న సంక్రాంతి కి విడుదల చేయాలనుకున్నారు కానీ అనివార్య కారణాల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో మరోసారి వాయిదా వేశారు. అయితే తాజా పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకోవడంతో ఈ చిత్రాన్ని మార్చి 25న విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. మార్చిలోకి ఎంటర్ కావడంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసేశారు మేకర్స్.
శివరాత్రి సందర్భంగా ఓ ఆసక్తికరమైన పోస్ట్ ని అభిమానుల కోసం సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. స్నాప్ చాట్. కామ్‌లో అఫీషియల్ పేజీని క్రియేట్ చేసిన చిత్ర బృందం అందులో అభిమానులు చేరాల్సిందిగా కోరింది. ఇందు కోసం ప్రత్యేక ఫిల్టర్ ని షేర్ చేసిన మేకర్స్ దాన్ని ఎలా ఉపయోగించాలో వివరించారు. దీంతో అభిమానులు ఫిల్టర్ తో కూడిన ఫొటోలతో కామెంట్ లు చేయడం మొదలుపెట్టారు. 25 కోసం మార్చింగ్ చేస్తున్నామని, భారత దేశం అంతటా మార్చింగ్ కోసం ఓ స్నాప్ షాట్ స్టిక్కర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. దాన్ని మీ పార్ట్నర్ లతో షేర్ చేయండని ఆసక్తికరంగా ఫ్రీ ప్రమోషన్స్ కి శ్రీకారం చుట్టింది `ఆర్ ఆర్ ఆర్` టీమ్.
ఇదిలా వుంటే ఈ మూవీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు ఎప్పుడెప్పుడు మార్చి 25 వచ్చేస్తుందా?.. ఎప్పుడెప్పుడు థియేటర్లలో సందడి చేయాలా? అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటించిన సినిమా కావడంతో ఈ ఇద్దరు హీరోలకు సంబంధించిన అభిమానులు `ఆర్ ఆర్ ఆర్` కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు మరో 24 రోజుల్లో తెరపడబోతోంది.
అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించారని ఇప్పటికే టాక్ బయటికి వచ్చేసింది. బ్రిటీష్ అధికారికగా రామ్ చరణ్ కనిపించే సన్నివేశాలు... ఈ సందర్భంగా ఎన్టీఆర్ - చరణ్ మధ్య జరిగే ఫైట్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుండగా అడవిలో పులితో ఎన్టీఆర్ చేసే వీరోచితమైన పోరాటం ప్రధాన హైలైట్ గా నిలవడమే కాకుండా థియేటర్లలో రోమాంచిత అనుభూతిని కలిగించడం ఖాయం అంటున్నారు.
1920 కాలంలో ఇండిపెండెంట్ కోసం ఇద్దరు రియల్ హీరోలు చేసే సమరం నేపథ్యంలో ఈ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కించారు. ఇంతకీ అల్లూరి సీతారామరాజు -కొమరం భీం ఎలా కలిశారు? ఎందుకు కలిశారు? .. కలిశాక ఇద్దరు కలిసి ఏం చేశారు? .. వీరిద్దరి మధ్య జరిగిన సంఘర్షణ ఏంటీ? ... అనే ఆసక్తి ప్రతీ ఒక్కరిలోనూ మొదలైంది. ఇద్దరినీ 70 ఎం ఎం స్క్రీన్ పై చూసే ఆ రోజు కోసం ఎదురుచూస్తున్న ప్రతీ ఒక్కరూ సినిమాని ఓ రేంజ్ లో ఊహించుకుంటున్నారు. అందరి అంచనాలకు మించి ఈ మూవీ ఉంటుందని చిత్ర బృందంతో పాటు జక్కన్న చెబుతున్నాడు. ఆ వండర్ ని చూడాలంటే.. కళ్లారా ఆస్వాదించాలంటే మరో 24 రోజులు ఎదురుచూడక తప్పదు.