Begin typing your search above and press return to search.
RRR: ఉగాది కానుక ఇవ్వనున్న జక్కన్న?
By: Tupaki Desk | 10 March 2020 5:11 AM GMTదేశవ్యాప్తం గా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'RRR'. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలు గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ అలియా భట్.. అజయ్ దేవగణ్ కూడా ఈ సినిమాలో భాగంగా ఉండడంతో అటు హిందీ ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం ఉగాది పర్వదినం సందర్భంగా 'RRR' ఫుల్ టైటిల్ ప్రకటించాలని జక్కన్న టీమ్ ప్లాన్ చేస్తున్నారట.
RRR అనేది ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్ అనే సంగతి తెలిసిందే. దీనికి ఫుల్ ఫామ్ గా రెండు పేర్లు పరిశీలిస్తున్నారట. అందులో ఒకటి 'రఘుపతి రాఘవ రాజారాం' కాగా రెండవది 'రామ రావణ రాజ్యం'. ఈ రెండిటిలో ఒక టైటిల్ ను ఫైనలైజ్ చేసి ఉగాది నాడు అధికారికం గా ప్రకటిస్తారట. ఈ టైటిల్ విషయం పక్కన పెడితే ఈ సినిమా 'బాహుబలి' స్థాయిలో కలెక్షన్స్ రాబట్టగలుగుతుందా అనే విషయంపై కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 'బాహుబలి' సోలో రిలీజ్.. పైగా 'బాహుబలి' జక్కన్న అండ్ కో వాడిన ప్రమోషన్ స్ట్రేటజీ పూర్తి స్థాయిలో వర్క్ అవుట్ కావడంతో హైప్ ఆకాశాన్ని టచ్ చేసింది. మొదటి భాగం సమయంలో 'భారతదేశంలో అత్యధిక బడ్జెట్ తో నిర్మించిన సినిమా' అనే టాగ్ ఉపయోగపడగా.. రెండవ భాగం వచ్చేసరికి 'వై కట్టప్ప కిల్డ్ బాహుబలి?' అనే ప్రశ్న భారీ హైప్ తీసుకొచ్చింది. ఇదే 'RRR' విషయం లో ఇలాంటి క్రేజ్ ఇప్పటివరకూ కనిపించడం లేదు.
నిజానికి రాజమౌళి టీమ్ 'బాహుబలి' కి వాడిన మార్కెటింగ్ టెక్నిక్స్ 'RRR' కోసం వాడడం లేదనే అభిప్రాయం ఉంది. కానీ థియేట్రికల్ రైట్స్ మాత్రం బాహుబలి కంటే ఎక్కువగా చెప్పడం తో రికవరీ ఉంటుందా అని బయ్యర్లు కాస్త ఆందోళనగానే ఉన్నారని టాక్ వినిపిస్తోంది. సంక్రాంతి సమయంలో పోటీలో రిలీజ్ కానుండడం వారి టెన్షన్ ను మరింత పెంచుతోంది. మరి జక్కన్న ఏం మ్యాజిక్ చేస్తారో వేచి చూడాలి.