Begin typing your search above and press return to search.

జపాన్ లో 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో ఆ విషయం కన్ఫర్మ్‌

By:  Tupaki Desk   |   24 Oct 2022 12:30 AM GMT
జపాన్ లో ఆర్‌ఆర్‌ఆర్‌తో ఆ విషయం కన్ఫర్మ్‌
X
ప్రపంచ వ్యాప్తంగా సినిమా పరిశ్రమ ఒకింత గడ్డు కాలం ను ఎదుర్కొంటుంది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్ల యొక్క మనుగడ కష్టంగా మారుతుంది అనుకుంటున్న సమయంలో ఏదో ఒక సినిమా వచ్చి ఇండస్ట్రీకి ఊపిరి ఊదుతున్నట్లుగా అనిపిస్తుంది.

ఇప్పుడు ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమాకు జపాన్ లో దక్కుతున్న ఆదరణ మరియు చిత్ర యూనిట్‌ సభ్యులు అక్కడ చేస్తున్న ప్రమోషన్ కార్యక్రమాలు చూస్తూ ఉంటే మంచి కంటెంట్‌ ఉన్న సినిమాకు మంచి ప్రమోషన్ చేస్తే తప్పకుండా థియేటర్లకు జనాలు వస్తారని నిరూపితం అయ్యింది.

థియేటర్లను జనాలు ఇప్పుడు.. ఎప్పుడు కూడా మిస్‌ చేసుకోరు అంటూ ఈ విషయాన్ని ఆర్‌ ఆర్ ఆర్‌ ను జపాన్ లో ఆధరిస్తున్న తీరును చూస్తూ ఉంటే అర్థం అవుతోంది. నెట్‌ ఫ్లిక్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా సినిమాను స్ట్రీమింగ్‌ చేయడం జరిగింది. అయినా కూడా ఆర్ ఆర్‌ ఆర్‌ వంటి విజువల్ వండర్ మూవీని థియేటర్‌ లోనే చూడాలని అక్కడి వారు కోరుకుంటున్నారు.

సినిమాకు చేసిన పబ్లిసిటీ మరియు చిత్ర యూనిట్‌ సభ్యులు పెట్టిన ఎఫర్ట్‌ వల్లే జపాన్ లో ఆర్‌ ఆర్‌ ఆర్‌ కి మంచి స్పందన దక్కింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచ వ్యాప్తంగా కూడా సినిమాలు మంచి కంటెంట్‌ తో వస్తే జనాలు థియేటర్లకు రావడం పక్కా అని ఈ సినిమా తో కన్ఫర్మ్‌ అయ్యింది.