Begin typing your search above and press return to search.
డాక్టర్ తో 'ఆర్.ఆర్.ఆర్' టీమ్ ఇంట్రాక్షన్..!
By: Tupaki Desk | 4 Jun 2021 10:30 AM GMTదర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న సినిమా ''ఆర్.ఆర్ ఆర్''. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సినిమా షూటింగ్ కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో నిలిచిపోయింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కరోనా మహమ్మారి గతేడాది నుంచి ఇబ్బందులు పెడుతూనే ఉంది. షూటింగ్ సకాలంలో జరగకపోవడంతో విడుదల కూడా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అలానే టీమ్ మెంబెర్స్ లో చాలా వరకు కరోనా బారిన పడ్డారు. రాజమౌళి - కీరవాణి ఫ్యామిలీతో పాటుగా తారక్ - చరణ్ కూడా వైరస్ బారినపడి కోలుకున్నారు. అయితే కరోనా విపత్కర పరిస్థితుల్లో 'ఆర్.ఆర్.ఆర్' చిత్ర బృందం ప్రజలకు అవగాహన కల్పిస్తూ వస్తున్నారు.
వ్యాక్సినేషన్ - ఆసుపత్రిలో బెడ్స్ - ఆక్సిజన్ సిలిండర్స్ అవైలబిలిటీ గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. ఈ క్రమంలో రాజమౌళి తన ట్రిపుల్ ఆర్ టీమ్ తో కలిపి సోషల్ మీడియా ద్వారా ప్రముఖ డాక్టర్ శంకర్ ప్రసాద్ తో ఇంట్రాక్షన్ నిర్వహించి అనేక సందేహాలను నివృత్తి చేసుకున్నారు. కరోనా వైరస్ నుంచి బయట పడటానికి ఎలాంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయాల గురించి కులంకుశంగా ఇందులో చర్చించారు. ఇంతకముందు కూడా ఆర్.ఆర్.ఆర్ బృందం ప్రజలకు కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు ఓ వీడియోతో ముందుకు వచ్చారు. మహమ్మారి బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ వీడియో ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేసారు.